»Siima Awards 2023 Ceremony In Dubai On 15th And 16th September
SIIMA: దుబాయ్ వేదికగా సైమా అవార్డులు.. నామినేషన్లో మన సినిమాలు
ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరిగే సైమా అవార్డులు ఈ ఏడాది కూడా దుబాయ్ వేదికగా అట్టహాసంగా జరగనున్నాయి. ఈ నెల 15, 16 రెండు రోజులు ఈ సెలబ్రేషన్స్ జరగనుండగా.. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు దుబాయ్ లో ప్రారంభం అయినట్లు తెలుస్తుంది.
SIIMA Awards 2023 Ceremony in Dubai on 15th and 16th September
SIIMA: SIIMA అవార్డ్స్ 2023 అనేది 11వ ఎడిషన్ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్. ఈ అవార్డుల వేడుక 2023 సెప్టెంబర్ 15, 16 తేదీలలో దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో జరుగుతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ పరిశ్రమలకు సంబంధించిన వేడుక ఈ సైమా అవార్డ్స్. దీనికి సంబంధించి నామినేషన్ ప్రక్రియా ఆగస్టు1 నుంచి మొదలైంది. పబ్లిక్ ఓటింగ్ ఆధారంగా బెస్ట్ సినిమా నుంచి మెస్ట్ యాక్ట్రెస్ వరకు అన్ని విభాగాల్లో అవార్డులను ప్రదానం చేస్తారు. ప్రతి సంవత్సరం అంగరంగా వైభవంగా జరిగే ఈ సెలబ్రేషన్స్ ఈ ఏడాది కూడా ఎక్కడ తగ్గకుండా చాలా ఘనంగా జరపనున్నారు.
అయితే SIIMA అవార్డ్లు 2023లో మొత్త సినిమాల్లో బెస్ట్ సినిమా కోసం పోటీ పడుతున్న సినిమాల్లో RRR, KGF 2, సీతా రామం, PS 1 చిత్రాలు నామినేట్ అయ్యాయి. తరువాత ప్రాంతీయ భాషాల్లో చిత్రాలను నామినేట్ చేశారు. విజేతను సెప్టెంబర్ 15-16 గ్రాండ్ సెలబ్రేషన్ డే రోజున ప్రకటిస్తారు. మరి తెలుగులో బెస్ట్ సినిమాల్లో పోటీపడుతున్న చిత్రాలు ఏంటో చూద్దాం.. 2022 ఫిబ్రవరి నెలలో విడుదలై డిజే టిల్లు చిత్రం ఆద్యాంతం ఎంటటైన్మెంట్ కోణంలో యంగ్‌స్టర్స్‌ని కట్టిపడేసింది. ఈ సినిమాలో సిద్దు జొన్నల గడ్డ, నేహా శెట్టి ఫార్ఫార్మెన్స్లు కూడా యూత్‌ను బాగా ఆకట్టుకున్నాయి. తరువాత కార్తికేయ 2. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఒవర్ నైట్‌లో నిఖిల్‌ను పాన్ ఇండియా హీరోను చేసింది. ఆ తరువాత దేశభక్తి నేపథ్యంలో వచ్చిన మేజర్ చిత్రం కూడా నామినేషన్ దక్కించుకుంది. అలాగే సినిమా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన త్రిబుల్ ఆర్, పాన్ ఇండియా రేంజ్లో ఆధారణ పొందిన సీతారామమ్ చిత్రం కూడా ఇదే నామినేషన్లో చోటు దక్కించుకున్నాయి.
ఇక బెస్ట్ తెలుగు డైరెక్టర్ నామినేషన్లో కృష్ణుడి తత్వాన్ని అద్బుతంగా చెప్పిన కార్తికేయ2 డైరెక్టర్ చందూ మొండేటి, అలాగే యుద్దాన్ని, ప్రేమను చెబుతూనే దేశం త్యాగం చేసిన ప్రేమకథను అందించిన సీతా రామమ్ డైరెక్టర్ హను రాఘవపూడి, ఒక్క సినిమాతో తెలుగు పతకాన్ని ఆస్కార్ వేదికపై నిలబెట్టిన త్రిబుల్ ఆర్ డైరెక్టర్ రాజమౌళి, 26/11 ముంబాయ్ దాడుల్లో ప్రాణాలను ఒదిలిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన మేజర్ డైరెక్టర్ శశి టిక్కా, అలాగే అట్లుంటది మనతోటి అంటూ యూత్‌కు కనెక్ట్ అయ్యే సినిమా తీసిన డిజే టిల్లు డైరెక్టర్ విమల్ కృష్ణ లు నామినేషన్లో పోటీపడుతున్నారు.
ఇక నెక్ట్స్ బెస్ట్ లీడ్ రోల్లో మేజర్ చిత్రంలో సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అందిరిచేత కంటతడి పెట్టించిన అడవి శేషు. దేశామా, ప్రేమానా అంటే దేశంపై ప్రేమా అని సీతా రామమ్ సినిమాతో ప్రేక్షకుడి కళ్లను చెమర్చిన హీరో దుల్కర్ సల్మాన్. కోమరం భీమ్ పాత్రలో యావత్తు ప్రపంచాన్ని అబ్బుర పరిచిన ఎన్టీఆర్, సీతారామ రాజు క్యారెక్టర్లో గ్లోబల్ స్టార్‌గా మారిన త్రిబుల్ ఆర్ యాక్టర్ రామ్ చరణ్, కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన నిఖిల్ సిద్దార్థ్, అలాగే తన బాడీ లాంగ్వేజ్‌తో కిర్రాక్ హిట్ కొట్టిన డిజే టిల్లు హీరో సిద్దు జొన్నల గడ్డ ఈ విభాగంలో పోటీ పడుతున్నారు.
ఇక అందాల హీరోయిన్లు సైతం బెస్ట్ ఫీమేల్ లీడ్ రోల్ కోసం పోటీపడుతున్నారు. అందులో భాగంగా హిట్, ది సెకండ్ కేస్ సినిమా హీరోయిన్ మీనాక్షి చౌదరి, సీతా రామమ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్, డీజే టిల్లులో రాధిక పాత్రలో మత్తెక్కించిన నేహా శెట్టి, భీమ్లా నాయక్ గడుసు వైఫ్‌గా నటించిన నిత్యా మీనన్, యశోదగా సమంత, అలాగే మాస్ మహారాజ్ రవితేజతో జతకట్టిన ధమాకా హీరోయిన్ శ్రీలీల ఈ కేటగిరిలో పోటీ పడుతున్నారు. అలాగే తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ విభాగాల్లో పోటీలో ఉన్నారు. మరి వీళ్లలో ఎవరు బెస్ట్‌గా నిలవబోతున్నారో తెలియాలంటే సెప్టెంబర్ 15,16 వరకు వెయిట్ చేయాల్సిందే.