Today Horoscope:ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోవాలంటే హిట్ టీవీ వెబ్ న్యూస్లో ఉన్న రాశి ఫలాలు చూడగలరు.
మేషం : ప్రయత్న కార్యాలలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. కుటుంబం సంతోషంగా గడుపుతుంది. ముఖ్యమైన పని పూర్తికావడంతో ఆనందం ఎక్కువ అవుతుంది. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడుతారు.
వృషభం : నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది, ఆనందంగా ఉంటారు.
మిథునం : స్త్రీల వల్ల లాభాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్త వింటారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. కుటుంబం సౌఖ్యంగా ఉంటుంది. సన్నిహితులను కలుస్తారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు.
కర్కాటకం : ఆకస్మిక ధన లాభం ఉంటుంది. రాజకీయరంగంలోని వారికి, క్రీడాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. అన్నింటిలో విజయం సాధిస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది.
సింహం : స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. బంధు, మిత్రులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలు అధికం అవుతాయి.
కన్య : కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన లాభంతో రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునేందుకు కృషి చేస్తారు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు.
తుల : ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధలతో బలహీనులు అవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.
వృశ్చికం : మిక్కిలి ధైర్య, సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మబుద్ధితో విజయం సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రుబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక లాభాలుంటాయి.
ధనస్సు : విదేశియాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. మెలకువగా ఉండటం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలుంటాయి. రుణలాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఏర్పడుతాయి.
మకరం : కుటుంబ కలహాలు దూరం అవుతాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాలతో అలసట చెందుతారు. చెడుపనులకు దూరంగా ఉండడం మంచిది. అందరితో స్నేహంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి.
కుంభం : విందు, వినోదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.
మీనం : గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల వల్ల లాభం ఉంటుంది. మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. బంధు, మిత్రులను గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తారు.