IRCTC:భక్తులకు ఐఆర్సీటీసీ (IRCTC) బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రస్తుతం వేసవిలో పిల్లలకు సెలవలు రావడంతో చాలా మంది పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలని అనుకుంటారు. అలాంటివారి కోసం ఆఫర్ తీసుకొచ్చింది. ‘పూర్వ సంధ్య’ పేరుతో సరికొత్త ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీలో తిరుపతి (tirupati), తిరుమల (tirumala), శ్రీనివాస మంగాపురం (srinivasa mangapuram), తిరుచానూర్ (tiruchanur), శ్రీకాళహస్తి (srikalahasti), కాణిపాకం (kaanipakam) ఆలయాలు ఉంటాయి.
ఫస్ట్ డే మధ్యాహ్నం హైదరాబాద్‌లో టూర్ ప్రారంభం అవుతుంది. లింగంపల్లి నుంచి సాయంత్రం 05:25 గంటలకు రైలు బయలుదేరుతుంది. తర్వాతి రోజు ఉదయం 05:55 గంటలకు తిరుపతికి చేరుకుంటారు. ఐఆర్సీటీసీ పికప్ చేసుకుని.. హోటల్ కి తీసుకెళ్తారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాల సందర్శనకు వెళ్లాలి. అనంతరం శ్రీ కాళహస్తి, తిరుచానూరు ఆలయాన్ని సందర్శించాలి. ఆ తర్వాత హోటల్ కి తిరిగి వెళ్తారు. భోజనం తర్వాత రాత్రి తిరుపతిలో బస ఉంటుంది.
ఇక షిరిడీ సాయిబాబాను దర్శించుకోవడానికి కూడా ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది. ఈ ప్యాకేజ్ హైదరాబాద్ నుంచే ప్రారంభం కానుంది. సాయి సన్నిధాన్ ఎక్స్ ప్రెస్ అని ఈ ప్యాకేజ్ కి పేరు పెట్టారు. ఈ నెల 17 నుంచి 23 వరకు ప్యాకేజీ అందుబాటులో ఉండనుంది. రెండు రాత్రులు, మూడు రోజులు పాటు టూర్ ప్యాకేజీలో వివిధ ప్రాంతాలను వీక్షించే అవకాశం ఉంది.
సికింద్రాబాద్ నుంచి సాయంత్రం 06.05 గంటలకు బయలుదేరాల్సి ఉంటుంది. రాత్రి ప్రయాణం కొనసాగుతుంది. రెండో రోజు ఉదయం 7.10 గంటలకు నగర్సోల్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి బస్సు మార్గం ద్వారా షిర్డీకి బయలుదేరుతారు. హోటల్‌కి చేరుకుంటారు. ఆ తర్వాత సాయిబాబా ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం 4 గంటలకు హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు.
ఆ తర్వాత శని శింగణాపూర్కు వెళ్తారు. అక్కడి నుంచి నగర్సోల్ రైల్వేస్టేషన్ చేరుకుంటారు. రాత్రి 08.30 గంటలకు మళ్లీ తిరుగు ప్రయాణం అవుతారు. రాత్రి ప్రయాణం కొనసాగుతుంది. మూడో రోజు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ప్యాకేజీ ముగియనుంది.