Minister Errabelli Dayakar Rao:మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) గౌడ (goud) అవతారం ఎత్తారు. అవును.. గిరక తాటి చెట్టు ఎక్కి మరీ ముంతను తీసుకొచ్చారు. కిందకు వచ్చిన తర్వాత ఆ తాటికల్లును సేవించారు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకూర్తిలో గల మల్లంపల్లిలో జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు (video) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిచ్చెన వేసుకొని గిరక తాటి చెట్టు ఎక్కారు. అక్కడ ఉన్న కల్లు ముంతను మెల్లిగా కిందకు తీసుకొచ్చారు. కింద కూర్చీలో కూర్చొని గ్లాసెడు కల్లు (drink) తాగారు. అక్కడ ఓ వ్యక్తి సార్.. ఈ కల్లును షుగర్ ఉన్న వారు తాగొద్దు కదా అన్నాడు. ఇంకేముంది ఎర్రబెల్లికి ఎక్కడో మండినట్టు ఉంది. తనకు లేదే అన్నట్టు.. షుగర్, బీపీ ఉన్న వారు తాగొద్దు అని చెప్పారు. నీకు బీపీ ఉంది కదా అని అంటూ.. అక్కడికి వెళ్లారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) ఎక్కిన గిరక తాటి చెట్టు మూడేళ్ల కింద ఆయన అందజేసిందే కావడం విశేషం. ఇప్పుడు ఆ చెట్లు పెద్దవై.. కల్లు అందిస్తున్నాయి. సాధారణ తాటిచెట్లు ఎత్తు పెరుగుతాయి. గిరక తాటిచెట్లు తక్కువ ఎత్తు ఉంటాయి. త్వరగా చేతికి అందుతాయి. ఈ చెట్లు ఎక్కడం సులువుగా ఉంటాయి. అందుకోసమే తెలంగాణ ప్రభుత్వం కల్లు గీత కార్మికులకు తాటి చెట్లను అందచేస్తోంది. ఈ చెట్లు బీహర్లో ఎక్కువగా ఉంటాయి.
గిరికతాటి చెట్టు ఎక్కి కల్లు తీసిన మంత్రి @EDRBRS గారు 👏👏