Anasuya:నాకున్న ధైర్యం ఎవరికీ లేదు.. ఏదైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతా.. అవసరమైతే కేసులు పెడతా.. నేనింతే.. అనే రేంజ్లో అనసూయ (Anasuya) గొప్పలు చెబుతుంది. ఈసారి మీడియాను తప్పు పట్టేలా మాట్లాడింది అమ్మడు. దానికి మీడియా వర్గాల నుంచి అదిరిపోయే కౌంటర్లు పడుతున్నాయి. అసలు తనకు నిజంగానే ధైర్యం ఉంటే.. ఇలా చేయమని అంటున్నారు.
బుల్లితెరపై ఎంత హాట్‌గా ఉంటుందో.. సోషల్ మీడియాలోనూ అంతే హాట్‌గా ఉంటుంది అనసూయ (Anasuya) . ఎప్పుడైనా తనను జనం మరిచిపోతున్నారనే డౌట్ వస్తే చాలు.. వెంటనే ఏదో ఒక కాంట్రవర్శీ క్రియేట్ చేసుకుంటుంది. దాని ఫలితంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ (vijay) ఫ్యాన్స్‌ను గెలికెస్తుంటుంది. ఇప్పటికే చాలా సార్లు అనసూయ వర్సెస్ రౌడీ మధ్య వార్ జరిగింది. రీసెంట్గా ‘ది’ అని రౌడీ పెట్టుకున్నందుకు పైత్యం.. అంటూ ఏదేదో ట్వీట్స్ చేసింది. అది కూడా ఇండైరెక్ట్‌గానే చేసింది. కానీ అక్కడ క్లియర్ కట్‌గా విజయ్ దేవరకొండనే ఆమె టార్గెట్‌గా కనిపిస్తోంది. దీంతో రౌడీ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఆంటీ.. హాట్ ఆంటీ.. అంటూ ట్రోల్ చేశారు. అయినా అనసూయ తగ్గేదేలే అంటోంది. అయితే తిట్టిన వారు, తిట్టించుకున్న వారు బాగానే ఉన్నారు. కానీ మీడియాదే తప్పన్నట్టుగా మీడియాపై నోరుపారేసుకుంది అనసూయ(Anasuya). అది కూడా యాటిట్యూడ్ చూపిస్తూ ఓ వీడియోని సోషల్ మీడియా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది.
‘నస పెట్టను సూటిగా పాయింట్‌కి వచ్చేస్తా.. కొన్ని వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానల్స్.. పబ్లిక్ ఫిగర్స్, పేరున్న వాళ్లపై వార్తలు రాసి పొట్ట నింపుకునేవాళ్ల కోసం నేను చెప్పబోతున్నాను. సో అండ్ సో ఫ్యాన్స్ అనసూయని ఏసుకున్నారు. సో అండ్ సో ఫ్యాన్స్ అనసూయని (Anasuya) ఏడిపించారు.. ట్రోల్ చేశారు.. అని కాదు రాయాల్సింది.
ఉప్పూకారం తింటే నిజాలు రాయండి.. దమ్మూ ధైర్యం ఉంటే.. ఇలాంటివి రాయండి అంటూ రెచ్చిపోయింది. మీడియాకు తను చెప్పినట్టు ధైర్యం ఉందా? లేదా? అనేది పక్కన పెడితే.. అసలు తనెందుకు ధైర్యంగా విజయ్ దేవరకొండ పేరు చెప్పకుండా.. డొంక తిరుగుడు పోస్ట్‌లు ఎందుకు చేస్తోంది? అని మీడియా పాయింట్ ఆఫ్ వ్యూలో కౌంటర్స్ వస్తున్నాయి. ఈ వీడియోలో కూడా సో అండ్ సో హీరో ఫ్యాన్స్ అని మాత్రమే చెప్పింది. మరి తనకు మాత్రమే ధైర్యం ఉందని చెప్పే అనసూయ.. ఎందుకు విజయ్ దేవరకొండ (vijay) పేరుని ప్రస్తావించకుండా ట్వీట్స్ చేస్తోంది? పైగా పబ్లిక్ ఫిగర్ చేసిన మీడియా పైనే నోరు పారేసుకుంటున్నావ్ ఆంటీ.. అంటూ మండి పడుతున్నారు. మరి అనసూయ (Anasuya) దీనిపై మళ్లీ ఎలాంటి కామెంట్స్ చేస్తుందో చూడాలి.