»Kalki 2898 Ad Super Chance Kalki Makers Bumperafar
Kalki 2898 AD: సూపర్ ఛాన్స్.. ‘కల్కి’ మేకర్స్ బంపరాఫర్!
నెక్స్ట్ పాన్ ఇండియా సినిమాల్లో రిలీజ్‌కు రెడీ అవుతున్న సినిమాల్లో కల్కి జూన్ 27న థియేటర్లోకి రానుంది. దీంతో ప్రమోషన్స్‌కు రెడీ అవుతున్నారు మూవీ మేకర్స్. అలాగ.. ఇప్పుడో బంపర్ ఆఫర్ ప్రకటించారు.
Kalki 2898 AD: అన్ని విధాలుగా భారీ ఎత్తున రాబోతోంది కల్కి 2898 ఏడి సినిమా. బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్లో మరో టర్నింగ్ పాయింట్‌గా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా, హాలీవుడ్ రేంజ్లో కల్కి రూపొందుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా హాలీవుడ్ నుంచే స్టార్ట్ అయ్యయి. కల్కి గ్లింప్స్‌ను కామిక్ కాన్ స్టేజీ మీద రిలీజ్ చేశారు. నెక్స్ట్ ప్రమోషన్స్‌ను కూడా హాలీవుడ్ లెవల్లోనే ప్లాన్ చేస్తున్నారు. జూన్ 27న భారీ ఎత్తున కల్కి మూవీని రిలీజ్ చేయనున్నారు. రీసెంట్‌గానే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ లాక్ చేశారు. మరో 60 రోజుల్లో కల్కి థియేటర్లోకి రానుంది.
ఇదే విషయాన్ని చెబుతూ.. బంపర్ ఆఫర్ ప్రకటించారు మేకర్స్. విజువల్ వండర్‌గా రాబోతున్న ఈ సినిమా కోసం 24 క్రాఫ్ట్స్‌లో చాలామంది పని చేస్తున్నారు. లేటెస్ట్గా.. గ్రాఫిక్ డిజైనర్లు, వీడియో ఎడిటర్లు, ఫోటోగ్రాఫర్లు, కంటెంట్ క్రియేటర్లు, మార్కెటింగ్ ఔత్సాహికులు, ఆసక్తి కలిగిన వారు కల్కి టీంలో చేరవచ్చు.. అంటూ ఓ ప్రకటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మేకర్స్. దీనికోసం VymCrew@gmail.com మెయిల్ ఐడీకి మెయిల్ చేయాల్సిందిగా చెప్పారు. ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.
ఇకపోతే.. కల్కి సినిమాను సైన్స్, పురాణాలతో కలిపి ఊహకందని విధంగా తెరకెక్కిస్తున్నాడు నాగ్ అశ్విన్. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులే కాదు.. సినీ ప్రేక్షకులు కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే.. కల్కి కాన్సెప్ట్‌తో ఓ యానిమేటేడ్ వీడియో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. థియేటర్లో కల్కి కథ మరింతగా అర్థం అయ్యేందుకు ఈ వీడియోని రిలీజ్ చేస్తున్నట్టుగా సమాచారం. మరి.. కల్కి ఎలా ఉంటుందో చూడాలి.