»South Koreas Bumper Offer For Couples Expecting A Baby
South Korea: బిడ్డను కనే దంపతులకు సౌత్ కొరియా బంపర్ ఆఫర్
పిల్లలను కనే పేరెంట్స్కు నగదు ఇచ్చి ప్రోత్సహిస్తుంది సౌత్ కొరియా. నెలకు రూ. 65 వేలు మొత్తం ఎనిమిది సంవత్సరాలు ఇవ్వనుంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తుంది.
South Korea's bumper offer for couples expecting a baby
South Korea: పిల్లలు ఉంటే ఖర్చు పెరుగుతుంది అనుకునే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. అలాంటి వారికోసం సౌత్ కొరియా గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. పిల్లలను కన్న పేరెంట్స్కు ఆర్థికంగా సాయం చేస్తామని చెబుతోంది. ఇప్పటికే ఈ పథకం అమలవుతోంది. కానీ ప్రభుత్వం అనుకున్నంత ఫలితం రాకపోవడంతో నగదు ప్రోత్సహాన్ని మరింత పెంచాలని ప్రభుత్వం
ఆలోచిస్తుంది. అయితే సౌత్ కొరియాలో గత కొంత కాలంగా జనాభా తగ్గుతుంది. జీవన వ్యయం పెరగడంతో పిల్లలు భారం అని పేరెంట్స్ భావిస్తున్నారు.
దీంతో దేశజనభా రేటు దారుణంగా పడిపోయింది. 2023 సంవత్సరంలో అత్యంత కనిష్ఠంగా జననాల రేటు 0.72కు పడిపోయింది. అందుకే ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ఒక్క బిడ్డకు నెలకు రూ.65 వేలు ఇంచేందుకు సౌత్ కొరియా ప్రభుత్వ సిద్ధంగా ఉంది. ఇలా ఈ భారీ మొత్తంలో ఎనిమి సంవత్సరాల పాటు ఇవ్వనున్నారు. అంటే మొత్తం రూ.61 లక్షలు ఇవ్వనున్నారు. దీనికి కోసం ప్రభుత్వంపై భారీ మొత్తంలో ఖర్చు అవుతుంది. సుమారుగా ఏటా రూ. 1.3 లక్షల కోట్లు వెచ్చించనుంది. అక్కడి ప్రభుత్వంలో ఈ మొత్తం సగం బడ్జెట్ అవుతుంది. ఇప్పటికే చైనాలో పిల్లలు లేక, యువకులు లేక అక్కడి ప్రభుత్వం భయభ్రాంతులకు గురవుతుంది. అలాగే దక్షిణ కొరియాకు కూడా ఆ పరిస్థితి రావద్దను ఈ నిర్ణం తీసుకుంది.