శోభకృత్ నామ సంవత్సరం వైశాఖ మాసం సప్తమి ఈ రోజు. ఏ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది? ఏ రాశి వారికి గురువారం ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఈ రోజు రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం: చేపట్టే పనులు విజయవంతమవుతాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పని పూర్తవుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయాలి.
వృషభం: ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ధైర్య సాహసాలతో పనులు పూర్తి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలపై మంచి ఆలోచనలు చేస్తారు. పరమేశ్వరుడిని ఆరాధించాలి.
మిథునం:వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. వృథా ప్రయాణాలు చేస్తారు. కొన్ని ఊహించని పరిణామాలు ఎదుర్కొంటారు. శత్రువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. లక్ష్మీ స్తుతిని పఠిస్తే శుభం కలుగుతుంది.
కర్కాటకం: అన్నింటా విజయాన్ని సాధించేందుకు శ్రమిస్తారు. మీరు చేసే పనుల్లో అభివృద్ధి కనిపిస్తుంది. అనవసర వ్యయప్రయాసలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబసభ్యుల మాటలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అనవసర విషయాలపై ఎక్కువ సమయం కేటాయించవద్దు. శివుడిని పూజించాలి.
సింహం:ఆకస్మిక ధనలాభం కలిగి ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంచి పనులు చేపడతారు. శారీరక శ్రమ పెరుగుతుంది. శివుడిని ఆరాధించాలి.
కన్య:కుటుంబంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. విష్ణుమూర్తిని దర్శించుకోవాలి.
తుల:ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదాలు వేసుకోవాల్సి ఉంటుంది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే ప్రమాదం ఉంది. ప్రయాణాలు మీకు మేలు చేస్తాయి. గో సేవ చేయాలి.
వృశ్చికం:శత్రు బాధలు తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు. శుభకార్యాలు జరుగుతాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. దైవరాధన చేస్తే మేలు జరుగుతుంది.
ధనుస్సు: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త పనులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. కొంత మానసిక ఆందోళనకు గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఇష్టదైవాన్ని పూజించుకోవాలి.
మకరం: కుటుంబ కలహాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు కొంత కలవర పెట్టవచ్చు. చేసే ప్రయత్నాలు పరిష్కారం లభిస్తాయి. కొత్త పనులు ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. దైవరాధన చేయాలి.
కుంభం: కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. పనులు విజయవంతమవుతాయి. కుటుంబంలో పరిస్థితులు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. కొన్ని కీలకమైన పనులు విజయవంతంగా పూర్తి చేయగలరు. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణం చేయాలి.
మీనం: కుటుంబ వ్యవహారాలు కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. వృథా ప్రయాణాలు అధికంగా చేస్తారు. శత్రువులు, గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. దుర్గా స్తోత్రం పఠిస్తే అంతా మంచే జరుగుతుంది.