శోభకృత్ నామ సంవత్సరం చైత్ర మాసం చతుర్దశి ఈ రోజు. ఏ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది? ఏ రాశి వారికి బుధవారం ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఈ రోజు రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం:మీ పనులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో ముందుచూపుతో వ్యవహరించాలి. కుటుంబంలో భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోండి. ధన వ్యయం ఉంటుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తవము పఠించాలి.
వృషభం: అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు దక్కుతాయి. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గణపతి ఆరాధన చేయాలి.
మిథునం: మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలి. అనవసర ఖర్చుల విషయాల జోలికి వెళ్లవద్దు. బంధువులతో సంతోషాలు పంచుకుంటారు. శివరాధన చేయాలి.
కర్కాటకం: ఇతరుల నుంచి గౌరవం పొందుతారు. కుటుంబ విషయంలో కొంత మానసిక ఆందోళనకు గురవుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా వ్యవహరించాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. గోసేవ చేస్తే సత్ఫలితాలు దక్కుతాయి.
సింహం: శుభ కార్యాలకు వెళ్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించవద్దు. ప్రయాణాలు మేలు చేస్తాయి. ఇష్ట దైవాన్ని ఆరాధించాలి.
కన్య:మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తిపరంగా జాగ్రత్తగా ఉండాలి. సహనం అన్ని విధాలా మేలు చేస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయవద్దు. గో సేవ చేయాలి.
తుల: కొంత మిశ్రమంగా ఉంటుంది. చేపట్టే పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగంలో సానుకూలత ఉంటుంది. మహాలక్ష్మి దేవిని దర్శించుకుంటే మేలు చేస్తుంది.
వృశ్చికం: చేపట్టే పనులు నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఎవరితోనూ భేదాభిప్రాయాలను కొని తెచ్చుకోవద్దు. మనో నిగ్రహం కోల్పోవద్దు. దుర్గాదేవిని ఆరాధించాలి.
ధనుస్సు: కుటుంబ పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. సహనంగా ఉండడం మేలు చేస్తుంది. అనవసర ధన వ్యయంతో రుణ ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. కొత్త వస్తులువు కొనుగోలు చేస్తారు. హనుమాన్ చాలీసా పఠించాలి.
మకరం:సత్ఫలితాలు పొందుతారు. శత్రువులపై విజయాలు సాధిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేందుకు జాగ్రత్తలు పాటించాలి. ఆంజనేయుడిని దర్శించుకుంటే మేలు.
కుంభం: ధర్మకార్యాలు చేస్తారు. దైవ దర్శనం పొందుతారు. మానసిక ఆనందం కలిగించే సంఘటనలు జరుగుతాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మేలు.
మీనం:మీ పనుల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కొంత గొడవలు పడే అవకాశం ఉంది. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. లక్ష్మీ గణపతి ఆరాధన చేయాలి.