Today Horoscope: ఈ రాశుల వాళ్లు జాగ్రత్త పడాలి.. మిగతా వారు
చైత్రమాసంలో వచ్చే నవమి మంచి రోజుగా భావిస్తారు. ఈ రోజు కొన్ని రాశుల వారికి శుభమే కలుగుతుందని పండితులు చెబుతున్నారు. శుభ ఘడియలు.. రాహుకాలం వంటి చూసుకుని జాగ్రత్తగా ఉంటే గురువారం అద్భుతంగా ఉంటుంది.
శోభకృత నామ సంవత్సరం చైత్రమాసం నవమి ఈ రోజు. చైత్రమాసంలో వచ్చే నవమి మంచి రోజుగా భావిస్తారు. ఈ రోజు కొన్ని రాశుల వారికి శుభమే కలుగుతుందని పండితులు చెబుతున్నారు. శుభ ఘడియలు.. రాహుకాలం వంటి చూసుకుని జాగ్రత్తగా ఉంటే గురువారం అద్భుతంగా ఉంటుంది. మరి ఏ రాశుల వారికి ఏయే ప్రయోజనాలు కలుగుతాయో చదవండి.
మేషం: మంచి ఆలోన విధానంతో అనుకున్నది సాధిస్తారు. కొత్త కార్యక్రమాలు చేపడతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనలాభం అనూహ్యంగా పొందుతారు. లక్ష్మిదేవిని ఆరాధించాలి.
వృషభం: ఈ రాశివారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి వ్యవహరించాలి. బంధుమిత్రులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ ఆలోచనలు చేస్తారు. ఈ రోజు హనుమాన్ చాలీసా చదివితే మేలు జరుగుతుంది.
మిథునం: ఈ రోజు వీరికి కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఇతరుల ప్రవర్తన మీకు కొంత అసౌకర్యం కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కోపాన్ని నియంత్రించుకుంటే మేలు. ఈ రోజు గోసేవ చేయాలి.
కర్కాటకం: మీ మీద మీకున్న విశ్వాసం ముందుకు నడిపిస్తుంది. కుటుంబసభ్యులతో ఆనందంగా ఉంటారు. ఒక వార్త మీ ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. లక్ష్మీదేవిని దర్శించుకోవాలి.
సింహం: వీరికి కొంత కలిసి రాకపోవచ్చు. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని సంఘటనలు మానసిక వేదనను కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా చదివితే సానుకూల వాతావరణం ఉంటుంది.
కన్య: వీరికి పరిస్థితులు రెండు విధాల ఉంటాయి. ఉత్సాహంగా పని చేస్తారు. ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు. వేంకటేశ్వరస్వామిని పూజించాలి.
తుల: మీ కష్టం మీకు ఫలిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ అవసరాలకు సహాయం చేసేవారు ఉంటారు. ఆంజనేయ స్తోత్ర పారాయణం చేయాలి.
వృశ్చికం: వీరికి ఈ రోజు కలిసి వస్తుంది. అనుకున్న ఫలితాలు సాధిస్తారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతాన అభివృద్ధికి శుభవార్త వింటారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదవాలి.
ధనుస్సు: పెండింగ్ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు. ఒక శుభవార్త వింటారు. అది మీ ఇంటిల్లిపాదిని ఆనందాన్ని నింపుతుంది. దుర్గా ధ్యానం చేయాలి.
మకరం: పెద్దల మాట వింటే సత్ఫలితాలు పొందుతారు. ధన, ధాన్య లాభాలు ఉన్నాయి. మానసిక ఆనందం లభిస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆంజనేయ ఆరాధన చేయాలి.
కుంభం: ద్వాదశ చంద్రసంచారం అనుకూలంగా లేదు. మానసిక ప్రశాంతత ఉండేలా చూసుకోవాలి. మీ శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. విష్ణు ఆరాధన చేయాలి.
మీనం: సంతృప్తికర ఫలితాలు పొందుతారు. మీ పనుల్లో పురోగతి ఉంటుంది. మానసికంగా ధైర్యంగా ఉండాలి. ఇష్ట దైవాన్ని పూజిస్తే మేలు జరుగుతుంది.