మేషం
మీ కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రతికూల ఆలోచనలు వదిలించుకోవడం మంచిది. వ్యాపారంలో ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లండి. మీరు చేపట్టే పనులకు మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు.నూతనకార్యాలు ప్రారంభించకుండా ఉండటం మంచిది. ఆత్మీయుల సహాయసహకారాల కోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది.
వృషభం
మీరు అన్నికార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి.కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మీ మాటతీరు మీకు గౌరవాన్ని తెస్తుంది.
మిథునం
మీరు పట్టుదలతో కొన్నికార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి.ఖర్చులపై నియంత్రణను కొనసాగించండి. ఉద్యోగంలో ప్రమోషన్ ఉండవచ్చు. మీరు కుటుంబం కోసం సమయాన్ని వెచ్చిస్తారు.
కర్కాటకం
వ్యాపార విషయాలలో జాప్యం చేయవద్దు. ఆలోచనాత్మకంగా సంతకం చేయండి. లావాదేవీ ప్రయత్నాలు బాగుంటాయి. కొన్ని ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పనులపై ప్రయాణం చేయాల్సి రావొచ్చు.అనారోగ్య బాధలు అధికమవుతాయి. అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అనవసర భయానికి లోనవుతారు. విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు.
సింహం
ఈ రోజు మీ ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం పుంజుకోవడంతో సంతోషంగా ఉంటారు. ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు. పోటీ భావన మీ మనసులో నిలిచిపోతుంది. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది.
కన్య
వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఈ రోజు మీకు సన్నిహితుల నుంచి మద్దకు పెరుగుతుంది. అనుకున్న ధనం కన్నా ఎక్కువ చేతికందుతుంది. కోర్టు వ్యవహారాల్లో సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. మీ హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. చాలా సంతోషంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. పోట్లాటలకు దూరంగా ఉండటం మంచిది.అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధసేవ తప్పదు.
తుల
వ్యాపారంలో మంచి ప్రయోజనాలను పొందుతారు. విద్యార్థులు లాభపడతారు. అనుకున్న పనులకు అడ్డంకులు ఎదురైనా కానీ పూర్తవుతాయి. పరిస్థితులకు అనుగుణంగా మీరు మారడం మంచిది. కొత్త విషయాలపై పూర్తి శ్రద్ధ చూపుతారు. వ్యాపార ప్రణాళికలను పునఃప్రారంభించవచ్చు.అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలు ఉంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు.
వృశ్చికం
మీరు కుటుంబంలో పెద్దల నుంచి మంచి సలహాలు పొందుతారు. ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఎవ్వరితోనూ అనవసర వాదనలకు దిగొద్దు. ఎవరైనా సలహా ఇస్తే చాలా ఆలోచనాత్మకంగా అమలు చేయండి.పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. అధిక పని అలసట కలిగిస్తుంది.సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్త వింటారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.
ధనుస్సు
మీరు కొన్ని ముఖ్యమైన పనులపై పూర్తి ప్రాధాన్యత ఇస్తారు. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఈ రోజు ఆర్థిక పరిస్థితి బావుంటుంది. దాంపత్య జీవితంలో సామరస్యం ఉంటుంది. ఎవరితోనైనా గొడవలు జరిగితే అవి సద్దుమణుగుతాయి. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర వ్యయప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది.
మకరం
వ్యాపార సంబంధిత విషయాలలో జాగ్రత్తగా ఉండండి. అందరినీ వెంట తీసుకెళ్లడానికి మీరు మీ వంతు ప్రయత్నం చేస్తారు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అద్భుతమైన అవకాశాలు పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ, సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికందుతుంది.
కుంభం
మీరు ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు కొత్త పనులు ప్రారంభించేందుకు అనుకూల సమయం. కుటుంబ పరిస్థితులను నియంత్రించవలసి ఉంటుంది. సన్నిహితుల నుంచి సహకారం ఉంటుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.
మీనం
కుటుంబంలో శుభకార్య నిర్వహణపై చర్చిస్తారు. కుటుంబంలో ఉన్న సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. కార్యాలయంలో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. ఎవ్వరితోనూ వాదనకు దిగొద్దు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.