»Horoscope Today Todays Horoscope 2024 April 11th Unnecessary Money
Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 April 11th).. అనవసర ధనవ్యయం
ఈ రోజు(2024 April 11th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
అనుకున్నది సాధిస్తారు. మీ మీ రంగాల్లో ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే బాగుంటుంది. వృషభం
మిశ్రమ కాలం. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తి చెందకపోవచ్చు. అస్థిరనిర్ణయాలతో సతమతం అవుతారు. కలహాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదవాలి. మిథునం
ప్రారంభించిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. మీ బుద్ధిబలంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఇష్టదైవారాధన శ్రేయస్సును ఇస్తుంది.
కర్కాటకం
శుభ సమయం. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు. సింహం
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఇష్టదైవ సందర్శనం ఉత్తమం. కన్య
ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. శివారాధన మంచిది.
తుల
శుభకాలం. చిత్తశుద్ధితో పనిచేసి విజయం సాధిస్తారు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్తపడాలి. అధికారుల కోపానికి గురికాకుండా, ఓర్పుగా వ్యవహరించండి. శివారాధన వల్ల మంచి జరుగుతుంది. వృశ్చికం
మిశ్రమ కాలం. మీ మీ రంగాల్లో శారీరకశ్రమ పెరుగుతుంది. గిట్టనివారితో మితభాషణం అవసరం. స్థానచలనం సూచితం. అప్పుల వల్ల ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. శ్రీఆంజనేయస్వామి ఆరాధన శుభదాయకం. ధనుస్సు
ప్రారంభించిన పనులను సులభంగా పూర్తిచేస్తారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక వార్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీలక్ష్మీదేవి సందర్శనం ఉత్తమం.
మకరం
పట్టుదల చాలా అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవాలి. బంధు,మిత్రులను కలుపుకొనిపోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈశ్వరారాధన శుభప్రదం. కుంభం
శ్రమ ఫలిస్తుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధనవ్యయం. ఇష్టదైవారాధన శుభకరం. మీనం
సమయానుకూలంగా ముందుకు సాగండి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. శ్రీలక్ష్మీ సందర్శనం ఉత్తమం.