»3700 Kg Khichdi Prepared And Served To 15000 Devotees In Madhya Pradesh
3700 KG Khichdi సాయినాథుడికి మహా ప్రసాదం.. ఎందుకో తెలుసా?
ఈ కిచిడీ కోసం భారీ కడాయిను తీసుకువచ్చారు. ఏకంగా 25 మంది 6 గంటల పాటు కష్టపడి వండారు. కాగా కిచిడీలో 400 కిలోల కూరగాయలు, 250 కిలోల బియ్యం, 60 కిలోల పప్పు దినుసులు వాడారు.
భక్తుల పాలిట కల్పతరువుగా షిర్డీ క్షేత్రం (Shirdi) విలసిల్లుతోంది. నిత్యం వేలల్లో భక్తులు దర్శించుకుంటారు. మతం కాదు మానవత్వమే గొప్పదని బోధించిన షిర్డీ సాయినాథుడికి (Shirdi Sainath) కోట్లాది మంది ప్రజలు ఆరాధిస్తారు. అలాంటి మూర్తికి ఓ భక్తుడు (Devotee) ఏకంగా 3,700 కిలోల కిచిడీ (khichdi) తయారు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. తన కోరిక మేరకు అంతటి మహా ప్రసాదాన్ని తయారుచేశాడు. ఈ వంటకం గిన్నీస్ పుస్తకంలో (Guinness Records) నమోదయ్యే అవకాశం ఉంది. ఇంతకీ ఎక్కడ తయారుచేశారో తెలుసా? మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని అవధిపురిలో.
అవధిపురికి (Avadhipuri) చెందిన రమేశ్ కుమార్ మహాజన్ (Ramesh Kumar Mahajan) బీహెచ్ఈఎల్ (BHEL) ఉద్యోగి. ఇటీవల ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందారు. 37 ఏళ్ల ఉద్యోగ బాధ్యతలను పూర్తి చేసుకున్న సందర్భంగా తన ఇష్టదైవం షిర్డీ సాయినాథుడికి ప్రత్యేకంగా పూజించుకోవాలని భావించాడు. స్థానికంగా సాయిబాబా ఆలయ ట్రస్ట్ సభ్యుడిగా కొనసాగుతున్న ఆయన తన 37 ఏళ్ల సర్వీస్ కు గుర్తుగా 3,700 కిలోల కిచిడీ చేయించాలని నిర్ణయించాడు.
సాయిబాబాకు ఇష్టమైన గురువారం (ఏప్రిల్ 27) కిచిడీ తయారు చేయించాడు. ఈ కిచిడీ కోసం భారీ కడాయిను (Bowl) తీసుకువచ్చారు. ఏకంగా 25 మంది 6 గంటల పాటు కష్టపడి వండారు. కాగా కిచిడీలో 400 కిలోల కూరగాయలు (Vegetables), 250 కిలోల బియ్యం (Rice), 60 కిలోల పప్పు (Dal) దినుసులు వాడారు. కిచిడీ పూర్తయిన తర్వాత సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 15,000 మంది భక్తులకు కిచిడీని పంపిణీ చేశారు.
కాగా, ఈ కిచిడీ తయారీ ప్రక్రియను మొత్తం రమేశ్ మహాజన్ వీడియో రికార్డు చేయించారు. కిచిడీ తయారీని గిన్నీస్ రికార్డు బృందానికి పంపించనున్నట్లు రమేశ్ తెలిపారు. 2020 జనవరిలో హిమాచల్ ప్రదేశ్ లో 1,995 కిలోల కిచిడీ తయారుచేసినట్లు గిన్నీస్ రికార్డుల్లో ఉందని, ఆ రికార్డు తిరిగరాసేలా ఈ ప్రయత్నం చేసినట్లు రమేశ్ ధీమా వ్యక్తం చేశారు. కాగా 3,700 కిచిడీ తయారీకి చేసిన ఖర్చు ఎంతో తెలుసా? రూ.5 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు రమేశ్ తెలిపారు.