»Telangana Missed Gold Ornament Bag Handed To Owner In Hyderabad Ramachandra Puram
Bag Handed రోడ్డుపై పడిపోయిన బంగారు ఆభరణాల బ్యాగ్ ను అప్పగించిన వ్యక్తి
పాపం ఎవరు పోగొట్టుకున్నారో అని భావించి.. పోగొట్టుకున్నవాళ్లు ఎంతో బాధపడుతారని భావించి ఆ బ్యాగ్ ను పోలీసులకు ఇద్దామని భావించాడు. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ కు చేరుకుని పోలీసులు ఆ బ్యాగ్ ఇచ్చాడు. జరిగిన విషయాన్ని వివరించాడు.
మరచిపోవడం.. పోగొట్టుకోవడం (Missing) అనేది మనకు అలవాటే. కానీ ఆ పోగొట్టుకున్న వస్తువులు మళ్లీ మనకు దొరకడం కలేగా భావిస్తాం. కానీ మంచి మనషులంటే ఆ వస్తువులు మన వద్దకు చేరడం ఖాయమే. నిజాయతీ (Honesty) ప్రదర్శిస్తే సమాజంలో గౌరవం పెరుగుతుంది. రోడ్డు మీద విలువైన బంగారు ఆభరణాల (Gold Ornaments) బ్యాగ్ కనిపిస్తే ఓ వ్యక్తి దాన్ని ఇంటికి తీసుకెళ్లలేదు. నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు అప్పగించాడు. ఆయన అప్పగించిన ఆభరణాల విలువ ఏకంగా రూ.25 లక్షలకు పైనే. నిజాయతీ ప్రదర్శించిన అతడిని పోలీసులు అభినందించారు. ఈ సంఘటన హైదరాబాద్ (Hyderabad)లో చోటుచేసుకుంది.
ఏపీలోని విజయవాడకు (Vijayawada) చెందిన నిరూప్ ఐటీ ఉద్యోగి. హైదరాబాద్ లోని సంగారెడ్డి జిల్లా బీరంగూడ (Beeramguda) కమాన్ సమీపంలోని సాయి భగవాన్ కాలనీలో నివసిస్తున్నాడు. ఇటీవల తన తమ్ముడు నిశ్చితార్థం కోసం విజయవాడ వెళ్లి తిరిగి బస్సులో (TSRTC Bus) హైదరాబాద్ కు వచ్చాడు. బస్సు దిగి ఇంటికి వెళ్లే క్రమంలో ఆభరణాలు ఉన్న బ్యాగ్ (Bag)ను పోగొట్టుకున్నాడు. ఆ విషయాన్ని కూడా మరచిపోయి ఇంటికి వెళ్లాడు. అయితే ఆ బ్యాగ్ ఆటో స్టాండ్ వద్ద పడిపోయింది.
అయితే ఆ పడిపోయిన బ్యాగ్ ను బీరంగూడకు చెందిన నరేందర్ (Narendar) చూశాడు. బ్యాగ్ తెరచి చూడగా ఆభరణాలు కనిపించాయి. బ్యాగ్ ఎవరిది అనేది చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. పాపం ఎవరు పోగొట్టుకున్నారో అని భావించి.. పోగొట్టుకున్నవాళ్లు ఎంతో బాధపడుతారని భావించి ఆ బ్యాగ్ ను పోలీసులకు ఇద్దామని భావించాడు. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ (RC Puram Station)కు చేరుకుని పోలీసులు ఆ బ్యాగ్ ఇచ్చాడు. జరిగిన విషయాన్ని వివరించాడు. సీఐ సంజయ్ కుమార్ (Sanjay Kumar) వివరాలు తెలుసుకుని బాధితుడికి సమాచారం అందించారు. అనంతరం బాధితుడు నిరూప్ ను స్టేషన్ కు పిలిచి బ్యాగ్ ను అప్పగించారు. నిజాయతీతో బ్యాగ్ ఇచ్చిన నరేందర్ ను నిరూప్ తోపాటు పోలీసులు అభినందించి ఘనంగా సన్మానించారు.