»Leaves Extended Central Govt Employees To Get 42 Days Special Casual Leave For Organ Donation
Organ Donation చేస్తే 42 రోజులు సెలవులు.. ఎవరికో తెలుసా?
మృతి చెందిన తర్వాత మన అవయవాలు ఖననం చేస్తే మట్టిపాలు, లేదా దహనం చేస్తే కాలి బూడిదవడం తప్ప ఇంకేం ప్రయోజనం ఉండదు. అదే మరణించిన తర్వాత కూడా మన అవయవాలు ఇతరులకు ఉపయోగపడితే అంతకుమించిన పుణ్యం ఇంకోటి ఉండదు.
అవయవదానంపై (Organ Donation) ఇంకా ప్రజల్లో అవగాహన రాలేదు. మృతి చెందిన తర్వాత మన అవయవాలు ఖననం చేస్తే మట్టిపాలు, లేదా దహనం చేస్తే కాలి బూడిదవడం తప్ప ఇంకేం ప్రయోజనం ఉండదు. అదే మరణించిన తర్వాత కూడా మన అవయవాలు (Organs) ఇతరులకు ఉపయోగపడితే అంతకుమించిన పుణ్యం ఇంకోటి ఉండదు. ఇలాంటి అవయవదానంతో వేరేవారికి పునర్జన్మ (Rebirth) ప్రసాదించిన వారవుతారు. అలాంటి అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా భారత ప్రభుత్వం (Govt of India) అవయవదానం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. అవయవదానం చేస్తే 42 రోజుల పాటు సెలవులు (Holidays) తీసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను అవయవదానంలో ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం సెలవులను పెంచింది. ఇప్పటివరకు ఆయా ఉద్యోగులు 30 రోజుల ప్రత్యేక సెలవులు (Special Leaves) వాడుకునేందుకు అవకాశం ఉండేది. తాజాగా వాటిని 42 రోజులకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ‘దాత శరీరం నుంచి దానం చేసే అవయవాన్ని తొలగించడానికి భారీ శస్త్ర చికిత్స (Surgery) అవసరమవుతుంది. వారు కోలుకోవడానికి సమయం పడుతుంది. అవయవ సేకరణకు ఎలాంటి శస్త్ర చికిత్స (Operation) నిర్వహిస్తారనే అంశంతో సంబంధం లేకుండా గరిష్టంగా 42 రోజులు సెలవులు మంజూరు చేయాలని నిర్ణయించాం’ అని కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ వెల్లడించింది.