»Ka Paul Invited Requested To Pawan Kalyan Merge Janasena Party In Praja Shanthi Party
JanaSenaను నా పార్టీలో విలీనం చేయండి: కేఏ పాల్
ఇక ఏపీలో సీఎం జగన్ పాలనపై పాల్ తీవ్ర విమర్శలు చేశారు. రూ.3 లక్షల కోట్ల విలువైన గంగవరం పోర్టును రూ.3 వేల కోట్లకు అదానీకి అప్పనంగా అమ్మేశారు అని ఆరోపించారు.
ప్రజాశాంతి పార్టీ (Praja Shanthi Party) అధినేత, క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ (KA Paul) తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. ఇటీవల విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) విషయమై మాట్లాడి సంచలనం రేపారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో కలిసి విశాఖ ప్లాంట్ పై మాట్లాడిన విషయం తెలిసిందే. తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కు సంచలన సవాల్ విసిరారు. జనసేన పార్టీని (JanaSena Party) తన ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.
విజయవాడలో (Vijayawada) గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పవన్ నాతో కలిసి వచ్చే కలిసి పోటీ చేస్తాం. పవన్ మళ్లీ బీజేపీతో ఎందుకు జత కట్టవలసి వస్తోంది. ఆ పార్టీని ప్రజాశాంతి పార్టీలో విలీనం (Merge) చేయాలి’ అని పిలుపునిచ్చారు. ఇక ఏపీలో సీఎం జగన్ (YS Jagan) పాలనపై పాల్ తీవ్ర విమర్శలు చేశారు. రూ.3 లక్షల కోట్ల విలువైన గంగవరం పోర్టును (Gangavaram Port) రూ.3 వేల కోట్లకు అదానీకి అప్పనంగా అమ్మేశారు అని ఆరోపించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై స్పందిస్తూ.. ‘వివేకా హత్య కేసులో డ్రామా కొనసాగుతోంది. ఈ కేసులో బాధితులకు న్యాయం చేయాలని నేను ఇప్పటికే సీబీఐ జాయింట్ డైరెక్టర్ ను కలిసి కోరా. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశా’ అని వివరించారు.
‘వివేకాను (YS Vivekananda Reddy) ఎవరు? ఎందుకు? హత్య చేశారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇది కుటుంబ హత్యా? లేదంటే రాజకీయపరమైన హత్య అనేది తేలాలి’ అని తెలిపారు. అటు నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR)పై కూడా పాల్ విమర్శలు చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున అద్భుతంగా నిర్మించిన కొత్త సచివాలయాన్ని (New Secretariat) అంబేడ్కర్ జయంతి రోజున ప్రారంభించాలని కేసీఆర్ ను తాను కోరినట్లు తెలిపారు. కానీ కేసీఆర్ హిట్లర్ (Hitler) చనిపోయిన రోజున ప్రారంభిస్తున్నారని తెలిపారు.