China Severe Floods : చైనాలో తుఫాన్ అలజడి..వరదల్లో 29 మంది దుర్మరణం
భారీ వరదలకు చైనాలో 29 మంది మృతిచెందారు. గత నెలలో కూడా వరదల వల్ల 33 మంది మరణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చైనాలోని చాలా ప్రాంతాలు వరదల వల్ల ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ప్రజలు తీవ్ర నష్టాలతో తల్లడిల్లుతున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
చైనా(China)లో తుఫాన్ అలజడి రేపింది. తుఫాన్ ప్రభావం వల్ల భారీ వరదలు (Floods) సంభవించాయి. హెబీ ప్రాంతంలో వరదలు వెల్లువెత్తాయి. ఈ వరదల్లో 29 మంది దుర్మరణం (29 died) చెందారు. మరో 16 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. గత నెల ఆఖరిలో బీజింగ్ నగరంలో కూడా తీవ్ర వరదలు సంభవించాయి. భారీ వరదల వల్ల 33 మంది చనిపోయారు.
గతవారం కూడా భారీ వరదలకు (Floods) 12 మంది మృతిచెందారు. ఈశాన్య జిలిన్ ప్రావిన్స్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ మధ్యకాలంలో చైనాలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. చైనా రాజధాని సరిహద్దులోని హెబీ ప్రాంతంతో పాటుగా సరిహద్దు ప్రదేశాల్లో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. అనేక వస్తువులు నీట మునిగాయి. వరదల వల్ల దెబ్బ తిన్న ఇళ్లను శుభ్రం చేసేందుకు వరద బాధితులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
గత కొన్ని రోజుల నుంచి ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ(Weather) సంఘటనల్లో అనేక మార్పులు జరుగుతున్నాయి. వేడి తరంగాల వల్ల మిలియన్ల మంది ప్రజలు ప్రభావితం అయ్యారు. వాతావరణ మార్పుల వల్ల భారీ వరదలు తీవ్రం కానున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. వరదల వల్ల తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం వాటిళ్లినట్లు చైనా(China) మీడియా సంస్థలు తెలిపారు.