»Sangeetha Company Ceo Was Kidnapped In Mumbai Shiv Sena Mla Son Raj Surve Being Threatened With A Gun
Viral video: పట్టపగలే ఓ కంపెనీ CEOను తుపాకీతో బెదిరించి కిడ్నాప్
ఓ ఎమ్మెల్యే కుమారుడు(mla son) ఓ వ్యాపారం డీల్ విషయంలో కంపెనీ సీఈఓ(CEO)ను ఏకంగా తుపాకీ పట్టుకుని బెదిరించాడు. అంతేకాదు అతన్ని వాహనంలో ఎక్కించుకుని పట్టపగలే తీసుకెళ్లారు. అయితే ఈ తతంగం మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో వైరల్ గా మారింది.
sangeetha company CEO was kidnapped in mumbai shiv sena mla son Raj Surve being threatened with a gun
మహారాష్ట్ర(Maharashtra) ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే(shiv sena mla) ప్రకాష్ సర్వే కుమారుడు సంగీత కంపెనీ సీఈవోను తుపాకీతో కిడ్నాప్ చేసిన ఘటనపై గురువారం కేసు నమోదైంది. మరో మ్యూజిక్ కంపెనీ యజమాని మనోజ్ మిశ్రాతో ఆర్థిక వివాదాన్ని పరిష్కరించుకునే క్రమంలో ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో ప్రకాష్ సర్వే కుమారుడు రాజ్ సర్వే(Raj Surve)తో పాటు మరో 14 మందిపై ముంబైలోని వాన్రాయ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎమ్మెల్యే కుమారుడు తన కార్యాలయంలో దుర్భాషలాడారని, బెదిరించారని మ్యూజిక్ కంపెనీ సీఈవో రాజ్‌కుమార్ సింగ్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటన సమయంలో అక్కడి సీసీ కెమెరాల్లో వీడియో రికార్డు కాగా..ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది. వీడియోలో తుపాకులు పట్టుకుని బలవంతంగా ఆ కంపెనీ సీఈవోను తీసుకెళ్లడం కనిపిస్తుంది.
డిజిటల్, OTT హక్కులకు బదులుగా సంగీత సంస్థలకు రుణాలు అందించడంలో రాజ్‌కుమార్ సింగ్(Rajkumar Singh) కంపెనీ ప్రత్యేకత కలిగి ఉంది. ఆదిశక్తి ప్రై.లి. అనే సంగీత సంస్థతో తాము ఏడాది కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు. ఆ క్రమంలో దానిని మనోజ్ మిశ్రా నిర్వహిస్తున్నారు. అయితే కాంట్రాక్టును గౌరవించడంలో మనోజ్ మిశ్రా విఫలమయ్యారని, రుణం తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో నిర్లక్ష్యం వహించారని పేర్కొన్నారు. ఆ నేపథ్యంలో కాంట్రాక్ట్ రద్దు పత్రంపై తనను సంతకం చేయాలని బలవంతం చేశారని రాజ్ కుమార్ ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కుమారుడు మిశ్రాతో కలిసి ఈ దాడికి పాల్పడినట్లు ఆయన వెల్లడించారు. అంతేకాదు చెప్పినట్లు వినకపోతే తనను ఇంటికి వెళ్ళనివ్వనని బెదిరించారని సీఈఓ అన్నారు. తర్వాత రాజ్, మిశ్రా, పద్మాకర్, విక్కీ శెట్టి, పలువురిపై కిడ్నాప్, దాడి,బెదిరింపు ఆరోపణలపై భారతీయ శిక్షాస్మృతి, ఆయుధాల సెక్షన్ల కింద కేసు(case) నమోదు చేయబడింది.
शिवसेना विधायक प्रकाश सर्व के बेटे पर अपहरण का केस दर्ज, बंदूक की नोक पर एक म्यूजिक कंपनी के सीईओ का अपहरण । सीसीटीवी फुटेज में 10-15 लोग जबरन एक कार्यालय में घुसते, कर्मचारियों के साथ मारपीट करते और एक व्यक्ति को जबरन अपने साथ ले जाते हुए दिखाई दे रहे हैं। pic.twitter.com/jeOZ4yQiyS