విశాఖలో వైసీపీ ఎంపీ సత్యనారాయణ కుటుంబ సభ్యులు కిడ్నాప్ అయ్యారు. అతని భార్య జ్యోతి, కొడుకు చందుతోపాటు అతని సన్నిహితుడు, ఆడిటర్, వైసీపీ నేత గన్నమనేని వెంకటేశ్వరరావును కొంతమంది అపహరించారు. అయితే రియల్ ఎస్టేట్ బిజినెస్ నేపథ్యంలో వారిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎంపీ నగరంలో లేని క్రమంలో ఆనందపురంలోని కుమారుని వద్దకు వెల్లే సమయంలో కిడ్నాప్ జరిగినట్లు తెలుస్తోంది.
అయితే ముందుగా జ్యోతి, చందు కిడ్నాప్ అయ్యారని తెలిసి వెంకటేశ్వర్ రావు కూడా అక్కడికి వెళ్లడంతో అతన్ని కూడా వారు నిర్భంధించినట్లు తెలిసింది. అయితే ఇదంతా బుధవారమే జరుగగా పోలీసులు గోప్యంగా ఉంచి దర్యాప్తు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఎంపీ పేర్కొన్నారు. దీంతోపాటు ఎంపీ ఫ్యామిలీ కూడా క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు.