»In Godavarikhani Area A Family Tried To Commit Suicide By Dousing Themselves With Petrol To Repay Their Loan
Viral News: ఇచ్చిన అప్పు తిరిగియ్యమని పెట్రోల్ పోసుకున్నారు
ఆపద అంటే ఆరున్నర లక్షలను అప్పుగా ఇచ్చిన ఓ వ్యక్తి తనకు అవసరం ఉందని ఎన్నిసార్లు చెప్పినా తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వడం లేదని, కుటుంబంతో సహా వెళ్లి అతని ఇంటి ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేశారు.
In Godavarikhani area, a family tried to commit suicide by dousing themselves with petrol to repay their loan.
Viral News: మనుషులు అన్నాకా డబ్బు(Money) అవసరం ఉంటుంది. అవసరానికి ఇచ్చిపుచ్చకోవడం చాలా సాధారణం. అయితే కొన్ని సార్లు తీసుకున్న అప్పు సకాలంలో కట్టడం కుదరదు. అలాంటి సమయంలో ఇచ్చిన వ్యక్తి, తీసుకున్న వ్యక్తి మాట్లాడుకుని ఇంకోంత కాలం వాయిదా వేసుకుంటారు. ఇంకొన్ని సందర్భాలలో ఇచ్చిన వ్యక్తి గొడవ చేయడం, సదరు వ్యక్తి దగ్గర నుంచి వస్తువులు కానీ, దస్తావేజీలు(Documents) కానీ తీసుకెళ్లడం మాములుగా జరిగే పద్దతి. అయితే తెలంగాణ(Telangana) జిల్లా, గోదావరిఖని(Godarikhani) పట్టణంలో దీనికి విరుద్దంగా జరిగింది. డబ్బు ఇచ్చిన వ్యక్తి బాధితుడు అయ్యాడు. తన కుటుంబంతో సహా అప్పు పుచ్చుకున్న అతని ఇంటి ముందు ఆత్మహత్యయత్నం చేశారు. ఈ ఘటన స్థానికంగా కలవరం సృష్టిస్తోంది.
గోదావరిఖని, కళ్యాణ్ నగర్‌కు చెందిన శ్రీనివాస్ గతంలో అదే కాలనీకి చెందిన కైలాస్ అనే అతనికి ఆరున్నర లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. మధ్యలో శ్రీనివాస్‌కు అవసరం ఉందని అడిగినా అతను దాటవేశాడు. ఎంతటికీ ఇవ్వకపోవడంతో ఆవేదన చెందిన బాదితుడి కుటుంబం కైలాసం ఇంటి ముందుకు పెట్రోల్‌తో వచ్చి అడిగారు. ఇంట్లో తను లేకపోవడంతో, వారి ఫ్యామలీ మెంబర్లు సరైన బదులు ఇవ్వకపోవడంతో శ్రీనివాస్ కుటుంబం తెచ్చుకున్న పెట్రోల్ మీద పోసుకొని ఆత్మహత్యయత్నం చేసుకున్నారు. ఇదంతా చూస్తున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇరు కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు.
ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వాలని కుటుంబం ఆత్మహత్యాయత్నం
గోదావరిఖని పట్టణంలోని కళ్యాణ్ నగర్‌కు చెందిన శ్రీనివాస్ గతంలో అదే కాలనీకి చెందిన కైలాసానికి ఆరున్నర లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు.
ఇప్పటికీ తిరిగి ఇవ్వడం లేదని ఆవేదన చెందిన శ్రీనివాస్ తన కుటుంబంతో పాటు కైలాసం ఇంటి ఎదుట… pic.twitter.com/hlYnRNFwe9