»Electric Vehicles Are More Polluting Than Petrol And Diesel Vehicles
Electric vehicles: ఎలక్ట్రిక్ వాహనాలతోనే అధిక కాలుష్యం
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ముఖ్యంగా వాయుకాలుష్యం తగ్గించాలని చాలా దేశాలు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తున్నారు. అయితే వీటి వలనే కాలుష్యం అధికం అవుతుందని తాజా పరిశోధనలు వెల్లడించాయి.
Electric vehicles are more polluting than petrol and diesel vehicles
Electric vehicles: పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో చాలా దేశాలు ఎలక్ట్రిక్ వెహికిల్స్(Electric vehicles) వాడుతున్నారు. గత ఏడాది నుంచి భారత్‌లో విస్తారంగా వీటి వాడకం పెరిగింది. ఈ నేపథ్యంలో తాజా అధ్యయనం అందరూ షాక్ అయే విషయాన్ని వెలువరించింది. పెట్రోల్(petrol), డీజిల్(diesel) నడిచే వాహనాలకంటే ఎలక్ట్రిక్ వాహనాలే ఎక్కువ మోతాదులో కార్బన ఉద్గారాలను విడుదల చేస్తుందని పేర్కొంది. ఎమిషన్ అనలిటిక్స్ అనే సంస్థ ఈ విషయాలను బహిర్గతం చేసింది. ఫ్యూయల్‌తో నడిచే కార్లు, ఎలక్ట్రిక్ కార్లపై అధ్యయనం చేసింది. మాములు కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్ల ఇంజన్లో బ్యాటరీల బరువు ఎక్కువగా ఉంటుంది. దీంతో బ్రేక్ వేసినప్పుడు కార్లు ఎక్కువ ఘర్షనకు గురై హానికరమైన పదర్థాలను విడుదల చేస్తుందని పేర్కొంది.
పెట్రోల్, డీజిల్ కార్లకంటే ఎలక్ట్రిక్ కార్లలో విడుదలయ్యే కాలుష్యాలు 1850 రేట్లు అధికమని తెలిపింది. సింథటిక్ రబ్బర్, ముడిచమురుతో టైర్లను తయారు చేస్తుండడమే దీనికి కారణమని నివేదికలో పేర్కొంది. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో చాలా దేశాల ప్రభుత్వాలు తయారి కంపేనీలకు ప్రోత్సాహాలను కూడా అందిస్తున్నాచి. ఈ నేపథ్యంలో భారత్‌లో కూడా కొన్ని కంపెనీలు ఈవీ లను తయారు చేస్తున్నాయి. అయితే టైర్ల ద్వారానే ఎక్కువ కాలుష్యం అవుతుంది కాబట్టి దాన్ని తగ్గించే మార్గాలను అన్వేషించాలని ఎమిషన్స్ అనలిట్స్ పేర్కొంది. గతంలో ఐఐటీ కాన్పూర్ కూడా ఇదే విషయాన్ని వెల్లిడించింది. పెట్రోల్, డీజిల్ వేహికిల్స్ కంటే ఈవీ లతోనే అధిక కాలుష్యం అని చెప్పింది.