వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా(Adilabad District)లో ఆదివాసీల భాధలు చెప్పలేనివి. సరైన రోడ్డు సౌకర్యాలు, వైద్య సదుపాయాల లేమితో.. అత్యవసర సమయాల్లో ప్రాణాపాయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నొప్పుల బాధతో తల్లడిల్లుతున్న గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే.. డీజిల్ (Diesel) లేదని సిల్లీ రీజన్ చెప్పారు. డీజిల్ కోసం డబ్బును ఫోన్ పే చేసిన గంట తర్వాత ఘటనాస్థలికి వచ్చారు. అప్పటికే ఆ మహిళ నాలుగు గంటలపాటు పురిటినొప్పులతో నరకం అనుభవించి బిడ్డకు జన్మనిచ్చింది.నిర్మల్ జిల్లా పెంబి మండలం తులసిపెట్ మారుమూల గ్రామానికి చెందిన ఆదివాసీ గర్బిణీ (Adivasi Garbini) గంగమనికి పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్‌కు ఫోన్ చేశారు.
ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం(Road facility)లేకపోవడంతో, స్థానికులు ఆమెను దొత్తి వాగు దాటించి రహదారిపైకి వచ్చినప్పటికీ…డీజిల్ లేదని ఐటీడీఏ అంబుల్స్ రాక పోవడంతో రోడ్డుపైనే మగ శిశువుకు మహిళా జన్మనిచ్చింది. నాలుగు గంటలు గిరిజన మహిళ పురటి నొప్పులతో రోడ్డుపైనే నరక యాతన అనుభవించింది. ట్రైబల్(Tribal) గ్రామాలకు రాకపోకలకు వాగులపై వంతెనలు నిర్మించకపోవడం, స్థానికులు వాగు దాటించినా డీజిల్ కొరతో అంబులెన్స్ (Ambulance) రాకపోవడం అత్యంత విచారకరమన్న విమర్శలు వినవస్తున్నాయి. ఆదివాసీ మహిళ రోడ్డుపైన నాలుగు గంటల పాటు అనుభవించిన ప్రసవ వేదన ఘటనకు పాలకులు ఏం సమాధానం చెబుతారంటూ గిరిజనులు నిలదీస్తున్నారు. తామే వాగులు దాటి వచ్చినా కనీసం తమకు అత్యవసర అంబులెన్స్ వసతిని కూడా కల్పించిన దుస్థితికి పాలకులు సిగ్గుపడాలంటూ గిరిజన సంఘాలు(Tribal communities)విమర్శలు గుప్పిస్తున్నాయి.