»Cm Revanth Reddy We Will Move Forward With The Center For The Development Of The State
CM Revanth Reddy: రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు వెళ్తాం!
కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ రాష్ట్రాభివృద్ధికి ప్రమాదకరమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు వెళ్తామని చెప్పారు.
CM Revanth Reddy: కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ రాష్ట్రాభివృద్ధికి ప్రమాదకరమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు వెళ్తామని చెప్పారు. ఆదిలాబాద్లో 800 మెగావాట్ల ఎన్టీపీసీ రెండో విద్యుత్ కేంద్రాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీపీసీకి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి కుంటుపడుతుంది.
గత ప్రభుత్వ నిర్ణయాలతో విద్యుత్ ఉత్పత్తిలో వెనుకబడ్డాం. రాష్ట్రాభివృద్ధి కార్యాచరణతో ముందుకెళ్తాం. రాజకీయాలు కేవలం ఎన్నికల సమయంలోనే చేయాలి. ఆ తర్వాత అంతా అభివృద్ధి గురించే చర్చలు ఉండాలి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ప్రధాని మోదీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ది పనుల గురించి చర్చించాం. హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలను దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసినందుకు ప్రధానికి కృతజ్ఞతలు. ఇది తెలంగాణ అభివృద్ధిలో కీలకమైన స్కైవేల నిర్మాణానికి ఉపయోగపడుతుందని రేవంత్ రెడ్డి అన్నారు.