Ship Hijack: హిందూ మహా సముద్రంలో సోమాలియా తీరం దగ్గర మరో నౌక హైజాక్‌కు గురైంది. లైబీరియా జెండాతో ఉన్న ఈ నౌకలో దాదాపు 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. వాళ్లని రక్షించేందుకు భారత నావికాదళం యుద్ధనౌక ఐఎన్ఎస్ చెన్నైని పంపించింది. హైజాక్‌కు గురైన నౌక పేరు ఎంవీ లీలా నోర్ ఫోక్గా అధికారులు గుర్తించారు.
Indian Navy is closely monitoring a #hijacked ship MV LILA NORFOLK ship about which information was received around last evening. @indiannavy warship INS #Chennai moving towards the hijacked vessel to tackle the hijack situation. pic.twitter.com/SNepA4GArs
ఈ ఎంవీ లీలా నార్ఫోక్ షిప్‌ను ఎవరు హైజాక్ చేశారు. ఎందుకు చేశారనే విషయాలు ఇప్పటివరకు తెలియదు. నిన్న సాయంత్రం గుర్తు తెలియని సాయుధులు నౌకలోకి అక్రమంగా ప్రవేశించారు. వెంటనే రంగంలోకి దిగిన భారత నౌకాదళం గమనాన్ని సునిశితంగా పరిశీలిస్తోంది. ఐఎన్ఎస్ చెన్నైను రంగంలోకి దించడంతోపాటు ఎయిర్‌క్రాఫ్ట్‌ను పంపింది. ప్రస్తుతం నౌకలోని సిబ్బందితో కమ్యూనికేషన్ ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో హిందూ మహాసముద్రంలో ఈ ఘటనలు పెరుగుతున్నాయి.