WhatsApp has banned the accounts of 76 lakh Indians in a single month
WhatsApp: కస్టమర్ల భద్రతపై దృష్టి పెట్టిన వాట్సప్ ఫేక్ ఖాతాలను నిషేదిస్తోంది. అలా భారతదేశంలో భారీగా వాట్సప్లను తీసేసినట్లు పేర్కొంది. మెసేజింగ్ యాప్ వాట్సాప్ లక్షలాదిమంది భారతీయుల ఖాతాలపే తొలగించింది. 2021 ఐటీ నిబంధనలను అనుసరించి వినియోగదారుల రక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 29 మధ్య ఏకంగా 76,28,000 ఖాతాలను బ్యాన్ చేసినట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. వీటిలో 14.24 లక్షల ఖాతాలను వినియోగదారుల ఫిర్యాదుకు ముందే బ్యాన్ చేసినట్టు వెల్లడించింది.
భారతదేశంలో 50 కోట్లమంది వాట్సాప్ ఖాతాదారులు ఈ మెసేజింగ్ యాప్‌ను దుర్వినియోగం చేస్తున్నారన్న ఫిర్యాదులపై ఈ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఫిబ్రవరి నెలలోనే ఏకంగా 16,618 ఫిర్యాదులు వచ్చినట్లు వాట్సాప్ యాజమాన్యం తెలిపింది. ముఖ్యంగా వచ్చిన వాటిలో 22 ఫిర్యాదులపైనే చర్యలు తీసుకున్నట్టు వాట్సప్ వెల్లడించింది. జనవరి నెలలోనూ వాట్సాప్ 67.28 లక్షల ఖాతాలను నిషేధించింది. వాట్సప్‌ను ఉపయోగించకోని చాలా మంది ఫ్రాడ్ చేస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టనున్నట్లు వాట్సప్ తెలిపింది.