పతంజలి ఉత్పత్తుల కేసులో బాబా రాందేవ్ సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పారు. తప్పుడు యాడ్స్ విసయంలో పతంజలిపై పలు కేసులు నమోదైన విషయంలో ఎండీ బాలకృష్ణ సైతం కోర్టులో హాజరయ్యారు.
Baba Ramde: పతంజలి ఉత్పత్తుల విషయంలో తప్పుడు యాడ్స్ ప్రచురించారని కోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ మేరకు పతంజలి ఎండీ బాలకృష్ణ, రాందేవం హాజరయ్యారు. తప్పుడు యాడ్స్ ఇచ్చిన కేసులో యోగా గురువు బాబా రాందేవ్(Baba Ramdev) సుప్రీంకోర్టు ముందు క్షమాపణలు తెలిపారు. రాందేవ్, బాలకృష్ణలు ప్రత్యక్షంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాల ప్రకారం ఇద్దరూ కోర్టుకు వచ్చినట్లు వాళ్ల తరపు న్యాయవాది వెల్లడించారు. జస్టిస్ హిమా కోహ్లీ, అషానుద్దిన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.
వీరి ఉత్పత్తులను విక్రయంలో భాగంగా మార్కెటింగ్ యాడ్స్ తప్పుగా చిత్రీకరించి, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో రాందేవ్ బాబా క్షమాపణలు తెలిపారు. పతంజలి సంస్థ ఉత్పత్తులకు గురించి మెడికల్ యాడ్స్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ కేసులో గతంలో పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణ ప్రత్యక్షంగా కోర్టుకు క్షమాపణలు చెప్పారు.