Kejriwal : ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయిన సీఎం కేజ్రీవాల్‌ను 16వ తేదీ వరకు విచారణ నిమిత్తం రిమాండ్ లో ఉండనున్నారు. అంతవరకు ఆయనను కోర్టు ఆదేశాలతో ఈరోజు తీహార్ జైలుకు తరలించారు. అయితే తీహార్ జైలులో కేజ్రీవాల్‌కు ఉన్న సౌకర్యాలపై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. కేజ్రీవాల్ సెల్లో టీవీ సౌకర్యం కూడా ఉంది. 18 నుంచి 20 ఛానళ్లను చూసేందుకు జైలు అధికారులు అనుమతించారు.
కేజ్రీవాల్‌కు 24 గంటలూ వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూసుకున్నారు. కేజ్రీవాల్‌కు మధుమేహం సమస్య ఉండడంతో ప్రతిరోజూ ఆయనకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. కేజ్రీవాల్‌కు వారానికి రెండుసార్లు కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు కూడా అనుమతి ఇచ్చారు. అలాగే తనకు మూడు పుస్తకాలు, టేబుల్, మందులు, కుర్చీ ఇవ్వాలని కేజ్రీవాల్ కోర్టును కోరారు. దీనికి కోర్టు అనుమతిస్తుందో లేదో చూడాలి.