»Bjp Will Conspire Against 90 Percent Of Indians Bhatti Vikramarka
Bhatti Vikramarka: 90 శాతం భారతీయులపై బీజేపీ కుట్ర చేస్తుంది.
బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగించే కుట్ర చేస్తుందని తెలంగాణ డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అందుకోసమే 400 సీట్లు కావాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.
BJP will conspire against 90 percent of Indians... Bhatti Vikramarka
Bhatti Vikramarka: దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను తొలగించేందుకు కుట్ర జరుగుతుందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గాంధీ భవన్లో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాజ్యంగం కల్పించిన హక్కుల వలనే దళితులు, గిరిజనులకు రాజ్యాధికారం వచ్చిందని, అది చూసిన బీజేపీ తట్టుకోలేక పోతుందని విమర్శించిరు. కాంగ్రెస్ పెద్దలు జాగ్రత్తగా అమలు చేసిన రిజర్వేషన్లను తొలగించేందుకే 400 సీట్లు కావాలని కోరుతున్నట్లు భట్టి పేర్కొన్నారు.
ఇంకా మాట్లాడుతూ.. ‘‘దేశంలో సంపద, వనరులు, అధికారం కొద్దిమంది చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. జనభా ప్రకారం ప్రజలు వనరులను పొందలేకపోతున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వనరులను సమానంగా పంచుతామని అన్నారు. కులగణన చేపడుతాం అని వెల్లడించారు. బీజేపీ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తొలగించేందుకు కుట్ర చేస్తుందని, అలా చేస్తే దేశంలో మొత్తం 90 శాతం ప్రజల హక్కులు అనచబడుతాయని పేర్కొన్నారు. బలహీన వర్గాలు వృద్ధి చెందాలంటే దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని ఎదురుదెబ్బ కొట్టాలను, దానికి ప్రజలే తమ ఓటు రూపంలో సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ చేపట్టిన సంక్షేమ పథకాలపై కూడా కుట్ర జరుగుతుందని వెల్లడించారు.