నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వారిద్దరూ తల్లి బిడ్డలని తెలిసింది.
రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దౌసా కలెక్టరేట్ సర్కిల్ సమీపంలో అదుపు తప్పిన ఓ బస్సు.. బ్రిడ్జి పైనుంచి రైల్వే ట్రాక్ పై పడింది. దీంతో నలుగురు దుర్మరణం చెందారు.
బెంగుళూరులో ఓ మహిళా ప్రభుత్వ అధికారిని అర్థరాత్రి కత్తితో పొడిచి చంపారు. ఈ సంఘటన సుబ్రమణ్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని దొడకలసంద్రలోని గోకుల అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకుంది.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో గుర్తుతెలియని వాహనం ఢీకొని కారులో ప్రయాణించేవారు మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, కూతురు, మేనకోడలు సహా నలుగురు మృతి చెందారు.
ఓ ప్రభుత్వ పాఠశాలలో 50 మందికి పైగా బాలికలను అక్కడి ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులతో వేధించారని హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్(haryana womens commission) తెలిపింది. ఈ ఫిర్యాదుల పట్ల ఉదాసీన వైఖరి అవలంభించిన పోలీసులపై కూడా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే అసలు ఈ కేసు వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
నేపాల్‌లో ప్రకృతి విలయం పదుల సంఖ్యలో ప్రాణాల్ని బలిగొంది. శుక్రవారం రాత్రి భారీ భూకంపం సంభవించి సుమారు 70 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం భూపేష్ బఘేల్(Bhupesh Baghel)పై ఈడీ(ED) పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు సీఎం భూపేష్ బఘేల్‌కు రూ.508 కోట్లు ఇచ్చారని కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఈడీ పేర్కొంది. ఈ రాష్ట్రంలో నవంబర్ 7, 17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.
సూరత్‌తో సహా గుజరాత్ రాష్ట్రంలోని వివిధ నగరాల్లో మ్యూజిక్ సిస్టమ్, ల్యాప్‌టాప్‌తో సహా విలువైన వస్తువుల దొంగతనాలకు సంబంధించి 200 నేరాలకు పాల్పడిన తండ్రి-కొడుకులను సూరత్ క్రైమ్ బ్రాంచ్ కరాజన్ నుండి అరెస్టు చేసింది.
బీహార్‌లోని వైశాలిలో ఓ తాత మనవడిని కాల్చి చంపాడు. ఇక్కడ చాంద్‌పూర్ ఓపీ ఏరియాలోని చకంగోలా గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు వివాదంలో ఓ తాత మనవడిని రైఫిల్‌తో ఛాతీపై కాల్చాడు.
ఓ ప్రొబెషనరీ ఐపీఎస్ అధికారిని సైబర్ కేటుగాళ్లు వేధించారు. వీడియో కాల్ చేసి, రికార్డ్ చేశారు. తర్వాత డబ్బులు ఇవ్వాలని.. లేదంటే సోషల్ మీడియాలో వీడియో అప్ లోడ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో అతను సైబర్ పోలీసులకు ఈ విషయం తెలియజేశాడు.
వేగంగా వెళ్తున్న కారు ఆకస్మాత్తుగా అదుపుతప్పి ఢీవైడర్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మరణించారు. ఈ విషాద ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో జరిగింది.
బెడ్ పై నిద్రిస్తున్న ఓ వృద్ధుడిపైకి కాలుతున్న పేపర్ ను విసిరేసిందో మహిళ.. బెడ్ పైన బట్టలకు మంటలు అంటుకుని ఆ వృద్ధుడు చనిపోవాలనే ఉద్దేశంతో ఈ పని చేసిందని ఆమె భర్త ఆరోపిస్తున్నాడు.