అతిథ్యరంగ దిగ్గజం, ఒబెరాయ్ గ్రూప్ గౌరవ చైర్మన్ పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్ మంగళవారం ఉదయం మరణించారు. ప్రస్తుతం ఆయన వయసు 94. మంగళవారం ఉదయం ఆయన కన్నుమూసినట్లు ఒబెరాయ్ గ్రూప్ ప్రకటించింది.
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ కూతురు కూడా ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అయ్యాయి. కట్నం తీసుకొని రావాలని వేధించగా.. తమ్ముని వద్దకు వెళ్లింది. ఇల్లు ఖాళీ చేస్తున్నానని చెప్పి.. వచ్చిన తర్వాత భార్యతో గొడవ పడ్డాడు. ఆవేశంలో చేయి చేసుకొని హతమార్చాడు.
రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు, ట్రక్కు ఢీ కొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సహా ఓ వ్యక్తితో కలిపి మొత్తం ఆరుగురు మృతి చెందారు.
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సెలవులు వచ్చిన క్రమంలో సరదాగా ఎనిమిది మంది యువకులు కీసర మున్నేరు వాగులో ఈతకు వెళ్లారు. ఆ నేపథ్యంలో ఐదుగురు యువకులు ప్రమాదవశాత్తు గల్లంతు కాగా..వారిలో ముగ్గురు మృత్యావాత చెందారు.
దీపావళి క్లీనింగ్ వివాదంపై బీహార్ రాజధాని పాట్నాలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. దీపావళి రోజున క్లీనింగ్‌లో పొరుగింటి ఇంట్లో నీరు పడడంతో గొడవ జరిగినట్లు సమాచారం.
బజార్ ఘాట్ ప్రమాదంలో ఓ నాలుగు రోజుల పసికందు చనిపోయింది. చిన్నారి చనిపోవడంతో బంధువులు, స్థానికులు రోదిస్తున్నారు. ప్రమాద స్థలిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస యాదవ్ పరిశీలించారు.
మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో ఘోరం జరిగింది. దీపావళికి బోనస్ డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఇద్దరు ధాబా వర్కర్లు తమ యజమానిని కిరాతకంగా చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
అమీర్‌పేట్, పాతబస్తీల్లో ఈ తెల్లవారుజామున రెండు వేర్వేరు అగ్ని ప్రమాదాలు సంభవించాయి. అమీర్‌పేట్ పరిధిలోని మధురానగర్‌లోగల ఓ ఫర్నీచర్ గోదాంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్‌లో ఉన్న దాల్ సరస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.