Brazil: 37 people died in landslides due to heavy rains
Brazil: బ్రెజిల్లో భారీ వర్షాలు కురవడంతో వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో అధిక సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. అలాగే వంతెనలు, రోడ్లు ధ్వంసం అయ్యాయి. ఈ వర్షాల కారణంగా 37 మంది మృతి చెందగా.. మరో 74 మంది తప్పిపోయినట్లు అక్కడ అధికారులు తెలిపారు. చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఒక నెలలో కురవాల్సిన వర్షం ఒక్కరోజులో కురిసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో 12 విమానాలు, 45 వాహనాలు, 12 పడవలు 626 మంది సైనికులతో పాటు రెస్క్యూ సిబ్బంది ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. నదులు, కొండ ప్రాంతాల్లోని వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.