Prajwal Revanna: ప్రజ్వల్‌పై లుక్అవుట్ నోటీసు జారీ
దేవేగౌడ కుమారుడు రేవన్న, మనవడు ప్రజ్వల్ రేవణ్నపై నమోదైన లైంగిక దౌర్జన్యం కేసు కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుపై ఆయనపై లుక్అవుట్ నోటీసు జారీ చేసింది.
Prajwal Revanna: దేవేగౌడ కుమారుడు రేవన్న, మనవడు ప్రజ్వల్ రేవణ్నపై నమోదైన లైంగిక దౌర్జన్యం కేసు కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు హాజరు కావాలని దేవేగౌడ కుమారుడు, రేవణ్నకి నోటీసులు జారీ చేసింది. తనకు సమయం కావాలని ప్రజ్వల్ కోరారు. దీనికి తిరస్కరించిన సిట్ నేడు ఆయనపై లుక్అవుట్ నోటీసు జారీ చేసింది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న ప్రజ్వల్ రేవన్న ఈ కేసు విషయం తెలియగానే దేశం విడిచి వెళ్లిపోయారు.
విచారణకు హాజరు కావాడానికి వారం రోజులు గడువు కావాలని కోరారు. వాస్తవాలు త్వరలో తెలుస్తాయన్నారు. అయితే అతని అభ్యర్థనను సిట్ తిరస్కరించింది. ఈక్రమంలోనే లుక్అవుట్ నోటీసు ఇచ్చింది. దీంతో ప్రజ్వల్ దేశంలోకి రాగానే పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. అలాగే విచారణకు తన తండ్రి సహకరిస్తానని తెలిపారు. ప్రజ్వల్‌కి సంబంధించిన కొన్ని అభ్యంతరకర వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో అతనిపై తండ్రపై కేసు నమోదు చేశారు. ప్రజ్వల్ పాస్‌పోర్టు రద్దు చేయాలని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిన్న ప్రధాని మోదీకి లేఖ రాశారు.