డ్రగ్స్ కొనుక్కోవడానికి డబ్బులు లేక తల్లిదండ్రులు తమ పిల్లలను అమ్మేశారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న నలుగురిని అరెస్ట్ చేశారు.
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నారాయణవనం మండలం పోలీస్ స్టేషన్ సమీపంలో స్కూల్ బస్సు ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఓ విద్యార్థిని ప్రేమిస్తున్నానని టీచర్ మోసం చేశాడు. ఇంటికి తీసుకెళ్లి తాళి కట్టాడు. పెళ్లి అయ్యింది కదా అని.. ఆపై లైంగికదాడి చేశాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది.
దేశ రాజధానిలో దారుణం చోటు చేసుకుంది. మంగళవారం ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో హృదయ విదారకమైన కేసు వెలుగులోకి వచ్చింది. కేవలం రూ.350 కోసం ఓ మైనర్ 17 ఏళ్ల బాలుడిని హత్య చేశాడు.
మీకు అపరిచిత వ్యక్తుల నుంచి కాల్స్ వస్తున్నాయా? అయితే జాగ్రత్త. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు రోజుకో విధంగా పలువురికి కాల్ చేస్తూ దోచేస్తున్నారు. ఇటివల హైదరాబాద్ కు చెందిన ఓ 40 ఏళ్ల మహిళ నుంచి ఏకంగా రూ.1.59 కోట్లు లాగేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఈరోజు ఉదయం విశాఖ నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి ముందు ఉన్న స్కూల్ పిల్లల ఆటోను ఢీ కొట్టింది. దీంతో అందులోని ఏడుగురు చిన్నారులకు గాయాలయ్యాయి.
ఓ ప్లాట్ విక్రయం అంశంలో నటి స్వాతి దీక్షిత్, ఆమె స్నేహితులు మధ్యవర్తులుగా ఉన్నారు. అయితే అది కాస్తా వివాదాలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో విభేదాలు రావడంతో ఆ ఇంటిని నటితోపాటు పలువురు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏపీ ఫైబర్‌నెట్ కుంభకోణంలో నష్టపోయిన నిందితుల స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌పై ముందుకు వెళ్లాలని విజయవాడ అవినీతి నిరోధక కోర్టు (ACB Court ) మంగళవారం ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (ap cid)ని ఆదేశించింది.
రోజురోజుకు పలువురు మానవ సంబంధాలను మరుస్తున్నారు. ఈజీ పద్ధతిలో జీవితంలో సెటిల్ కావాలని చూస్తున్నారు. ఆ క్రమంలోనే ఓ యువకుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం తండ్రిపైనే కాల్పులు జరిపించాడు. ఈ ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది.
ఏపీ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఏపీ హైకోర్టు నిన్న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ అంశంపై ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని కనకమామిడి వద్ద నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం కూప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా..మరో 10 మంది గాయపడ్డారు.
పోలీసు వాహనం ఆగి ఉన్న ట్రక్కును ఢీకొనడంతో ఆరుగురు మృతిచెందారు. ఈ విషాద ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరొకరు గాయపడగా ప్రస్తుతం ఆస్పత్రికి చికిత్స అందిస్తున్నారు. ప్రధాని మోదీ సభకు బందోబస్తుగా పోలీసులు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.