రళకు చెందిన ఓ ఐదేండ్ల చిన్నారి బ్రెయిన్ ఈటింగ్ అమీబాతో మృతి చెందింది. స్థానికంగా ఉన్న చెరువులో ఆ బాలిక ఓ రోజు స్నానం చేయడం వల్ల నీటిలో ఉన్న అమీబా ముక్కు ద్వారా వెళ్లి మృతికి కారణమైంది.
Brain Eating Amoeba: కేరళకు చెందిన ఓ ఐదేండ్ల చిన్నారి బ్రెయిన్ ఈటింగ్ అమీబాతో మృతి చెందింది. స్థానికంగా ఉన్న చెరువులో ఆ బాలిక ఓ రోజు స్నానం చేసింది. ఆ కలుషిత నీటిలో ఉన్న ఫ్రీ లివింగ్ అమీడా ఆమె ముక్కుగుండా శరీరంలోకి వెళ్లి మెదడుపై తీవ్ర ప్రభావం చూపించింది. అయితే వైద్యులు ఈ వ్యాధిని సకాలంలో గుర్తించకపోవడం వల్ల ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు. సకాలంలో గుర్తించి వైద్య చికిత్స అందించిఉంటే బాలిక బ్రతికి ఉండేదని డాక్టర్లు తెలిపారు.
బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే..పరాన్నజీవి కానటువంటి బ్యాక్టీరియా వర్గానికి చెందిన ఒక రకమైన అమీబాతో వచ్చే వ్యాధి. కలుషితమైన నీటిలో జీవించే ఈ జీవి ముక్కు లేదా నోటిద్వారా శరీరంలోకి ప్రవేశించి మెదడును క్రమక్రమంగా పనిచేయకుండా చేస్తుంది. దీన్ని ఒకవిధంగా మెదడును తినేసే అమీబాగా పిలుస్తారు. ఈ వ్యాధి సోకినవారికి తొలుత తీవ్ర జ్వరం, తలనొప్పి, వాంతులు అవుతాయి. వెంటనే వైద్యసాయం అందించకపోతే బాధితుడు మరణించే ప్రమాదమున్నది. కేరళలో గతంలో 2017లో ఒకసారి, 2023లో మరోసారి ఈ కేసులు బయటపడ్డాయి.