»Psycho In London The Scenes Of Him Holding A Knife Went Viral
Viral News: లండన్‌లో సైకో వీరంగం.. కత్తి పట్టుకొని తిరిగిన దృష్యాలు వైరల్
లండన్‌లో ఒక సైకో వీరంగం సృష్టించాడు. కత్తి చేతులో పట్టుకొని వీధుల్లో తిరుగుతు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Viral News: సాధారణంగా విదేశాల్లో సైకో కిల్లర్స్ చేసే రచ్చ గురించి అప్పుడప్పుడు వార్తల్లో చదువుతూ ఉంటాము. షామింగ్ మాల్స్‌లో విచ్చలవిడిగా కాల్చేస్తుంటారు. అలాంటి ఘటనే ఒకటి బ్రిటన్‌లో తాజాగా చోటుచేసుకుంది. తూర్పు లండన్‌లో హైనాల్ట్ ప్రాంతంలో వరుసగా కొంత మంది కత్తిపోట్లకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి కత్తిపట్టుకొని ఇలాంటి దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. దానికి సంబంధించిన దృష్యాలు భయనంగా ఉన్నాయి. ఆ నేరస్తుడిని పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం వాహనంతో పాటు ఓ వ్యక్తి ఇంట్లోకి దూసుకొచ్చాడు. వెంటనే కత్తి తీసి దాడికి పాల్పడినట్లు చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ దాడిలో పోలీసులు కూడా గాయపడ్డారు. దీనిపై బ్రిటన్ హోం మంత్రి జేమ్స్ క్లెవర్లీ స్పందించారు… ఇందులో ఉగ్రకోణం లేకపోవచ్చని, స్థానికులు ఎవరు భయభ్రాంతులకు గురికావల్సిన పని లేదని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారుల నిఘా ఉందని, ఎప్పటికప్పుడు పర్యావేక్షిస్తున్నారని తెలిపారు. దాడికి సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని కోరారు. నేరస్తుడి వయస్సు దాదాపు 36 సంవత్సరాలు వరకు ఉంటుందని ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.