China: చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. హైవే రోడ్డులో కొంతభాగం కూలిపోవడంతో 19 మంది మృతి చెందారు. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లోని మీజౌ, డాబు కౌంటీ నగరాల మధ్య ఉన్న రోడ్డులో కొంతభాగం ఈరోజు తెల్లవారు జామున కూలిపోయింది. ఈప్రమాదంలో రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనాల్లోని 49 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న అధికారులు వాళ్లను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అందులో 19 మంది మృతి చెందారు. అకస్మాత్తుగా రోడ్డు నేలలోకి దిగబడి పోయింది. దీంతో రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనాలు లోతైన లోయలో పడిపోయాయి. అసలు రహదారి కూప్పకూలడానికి గల కారణాలు మాత్రం తెలియదు. ఇటీవల గ్వాంగ్డాంగ్ ప్రాంతంలో వాతావరణ మార్పులు, వరదలు, సుడిగాలులు సంభవించడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
🚨#WATCH: As daytime footage shows the aftermath of a highway collapse which left dozens of casualties in southern China.
At least 19 people were killed and 30 others were hospitalized after a section of a highway collapsed in the Guangdong province of… pic.twitter.com/r1hR0UXw65