»Nurse Heather Presdee Nurse Sentenced To 700 Years In Prison
Nurse Heather Presdee: నర్సుకు 700 ఏళ్లు జైలు శిక్ష
మెరికాలోని ఓ నర్సు పనిచేసే ఆసుపత్రిలో పేషేంట్లకు అధిక మోతాదులో ఇన్సులిన్ ఇచ్చి హత్య చేసేది. ఇలా చాలామంది మరణానికి కారణమయ్యిందని రుజువు కావడంతో అక్కడి కోర్టు ఆమెకు 700 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
Nurse Heather Presdee: Nurse sentenced to 700 years in prison
Nurse Heather Presdee: అమెరికాలోని ఓ నర్సు పనిచేసే ఆసుపత్రిలో పేషేంట్లకు అధిక మోతాదులో ఇన్సులిన్ ఇచ్చి హత్య చేసేది. ఇలా చాలామంది మరణానికి కారణమయ్యిందని రుజువు కావడంతో అక్కడి కోర్టు ఆమెకు 700 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పెన్సిల్వేనియాకు చెందిన నర్సు హీథర్ ప్రెస్డీ 2020-2023 మధ్య కాలంలో వివిధ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసింది. ఆ సమయంలో ఆసుపత్రికి వచ్చే రోగులకు మోతాదుకు మించి ఇన్సులిన్ ఇచ్చేది. దీంతో 17 రోగులు మరణించారు. ఆమె మూడు హత్యలు, 19 హత్యాయత్నాలు చేసినట్టుగా నేరాన్ని అంగీకరించారు.
ఇద్దరు రోగులను చంపినందుకు ఆమెపై మొదట గతేడాది మేలో కేసు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా ఇంకొంతమందిని ఆమె చంపిందని తెలిసింది. తనతో పనిచేసే ఉద్యోగులను విచారిస్తే.. ఆమె రోగులతో దురుసుగా ప్రవర్తించేదన్నారు. ఆమెకు మతిస్థిమితం సరిగ్గానే ఉందని, కానీ వ్యక్తిత్వం మంచిది కాదన్నారు. బాధిత కుటుంబసభ్యుల్లో ఒకరి తండ్రిని చంపడం చూశారని వాళ్లు కోర్టుకు తెలపడంతో శిక్ష పడింది.