»Evil Monster Uk Man Murders Wife Cuts Body Into Over 200 Pieces
Man Kills Wife : భార్యను చంపి… 200 ముక్కలు చేసి!
యూకేలో జరిగిన ఓ కిరాతక సంఘటన సంచలనం రేపింది. ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసి 200 ముక్కలుగా నరికాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Man Kills Wife : బ్రిటన్లో భార్యను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని 200 ముక్కలుగా చేశాడో కిరాతక భర్త. తన ఇంట్లోనే వారం రోజుల పాటు దాచి ఉంచి, తరువాత సమయం చూసి నదిలో పడేశాడు. బ్రిటన్కు చెందిన నికోలస్ మెట్సన్ (28) , హోలీబ్రామీ (26) కి ఏడాది క్రితం వివాహమైంది. వీరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. దీంతో భర్త కొన్నాళ్లుగా ఆమెను తన తల్లిదండ్రులతో కలవకుండా చేశాడు. ఆమె పెంపుడు కుక్కను వాషింగ్ మిషన్లో వేసి చిత్రహింసలకు గురి చేసి చంపేశాడు. ఇలాంటి అమానవీయ పనులు చాలా చేసేసరికి ఆమె విసిగిపోయింది. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది.
మార్చ్ చివరి వారంలో.. తన భర్త హింసిస్తున్నాడని బ్రామీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మార్చ్ 24న ఆ ఇంటికి వెళ్లారు పోలీసులు. ‘నేను కాదు. నా భార్యే నన్ను హింసిస్తోంది. నరకం చూపిస్తోంది. ఇదిగో.. నన్ను కరిచింది, చూడండి,’ అని నికోలస్ తన చెయ్యిని చూపించాడు. ఆ సమయంలో బ్రామీ ఇంట్లో లేదు. అప్పటికే ఆమెను అతను చంపేశాడు!
భార్యను కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని 200 ముక్కలు చేసి వారం రోజుల పాటు ఇంట్లోని కిచెన్లోనే ఉంచాడు. తర్వాత స్నేహితుడి సాయంతో నదిలో పడేశాడు. అందుకు సహకరించేందుకు స్నేహితుడికి 50 పౌండ్లు ఇచ్చాడు. మరుచటి రోజు మార్నింగ్ వాక్కు వెళ్లిన ఒక వ్యక్తి నదిలో తేలియాడుతున్న ప్లాస్టిక్ కవర్లను, అందులోని శరీర భాగాలను చూసి పోలీస్లకు ఫిర్యాదు చేశాడు. దీంతో మెట్సన్ దారుణం బయటపడింది. పోలీస్లు శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. షేవ్ చేసి ఉన్న బ్రామీ తల కూడా అందులో ఉంది. మరికొన్ని భాగాలు ఇంకా దొరకలేదు. మెట్సన్ను పోలీస్లు అరెస్ట్ చేయగా, నేరం అంగీకరించాడు.