దేశమంతటా సంక్రాంతి సందడి నెలకొంది. రంగురంగుల గాలిపటాలన్నీ ఎగురుతూ సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో పంతంగి మాంజ మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఆర్మీ అధికారి మెడపై చైనా మాంజా తగిలి గొంతు కోసింది.
ఏలూరు జిల్లా దుగ్గిరాల మండలం పినకడిమిలో పెను విషాదం చోటుచేసుకుంది. అత్తమామలు పెడుతున్న వేధింపులు భరించలేక.. ఇద్దరు తోడికోడళ్లు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తెలంగాణలో హృదయ విదారకమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పండుగకు భర్త కొత్త బట్టలు కొనలేదనే కోపంతో భార్య తన ఇద్దరు కూతుళ్లను హత్య చేసింది. అనంతరం ఆమె కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
నాంపల్లి రైల్వే స్టేషన్‌లో చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. చెన్నై నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం వద్దకు చేరుకోగానే పట్టాలు తప్పింది.
హర్యానాలోని సోనిపట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి-44పై సోనిపట్ గుండా వెళుతుండగా పయౌ మనియారి సమీపంలో అర్థరాత్రి ట్రక్కును కారు ఢీకొనడంతో ఢిల్లీకి చెందిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు మరణించారు.
భారత్ పొరుగు దేశం శ్రీలంకలో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. పూర్వ జన్మ కోరికతో మత గురువుతో సహా ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారు. గత మంగళవారం (జనవరి 2) యక్కల, మహారాగామ ప్రాంతాలకు చెందిన ఒక పురుషుడు , ఒక మహిళ మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బిల్కిస్ బానో కేసులో భారత సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది నిందితుల క్షమాభిక్షను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గుజరాత్ ప్రభుత్వానికి క్షమాభిక్ష ఇచ్చే అధికారం లేదని స్పష్టం చేసింది.
సూర్యపేటకు చెందిన ఓ యువతిపై ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్తామని చెప్పి అత్యాచారం చేశారని యువతి ఫిర్యాదు చేసింది.