Car accident: అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఓ కారు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో భారత సంతతికి చెందిన మహిళ మృతి చెందింది. అర్షియా జోషి అనే 21 ఏళ్ల మహిళ ఈ ఘటనలో మృతి చెందినట్లు అక్కడి అధికారులు నిర్దారించారు. న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. అమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
భారతీయ రాయబార కార్యాలయం స్పందిస్తూ.. ‘కారు ప్రమాదంలో అర్షియా జోషి మరణం బాధాకరం. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అర్షియా భౌతిక కాయాన్ని భారత్‌కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. సాధ్యమైనంత తొందరగా అర్షియా బాడీని భారత్‌కు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నాం’ పేర్కొంది.