»Arvind Kejriwal In Another Case Kejriwal Absent For Ed Investigation
Arvind Kejriwal: మరో కేసులో.. ఈడీ విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరు!
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ సమన్లను పట్టించుకోలేదు. ఢిల్లీ జల్ బోర్టుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కాలేదు.
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ సమన్లను పట్టించుకోలేదు. ఢిల్లీ జల్ బోర్టుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కాలేదు. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని.. విచారణకు ఆప్ సుప్రియో హాజరు కారని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఢిల్లీ జల మండలి కేసులో తొలిసారి కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ రోజు విచారణకు రావాలని ఆదేశించింది.
అదే విధంగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కూడా నిన్న తొమ్మిదోసారి సమన్లు పంపింది. ఈ కేసులో ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ సమన్లకు స్పందించని కేసులో కోర్టు కేజ్రీవాల్‌కు ఇప్పటికే బెయిల్ ఇచ్చిందని, అయినా ఈడీ మళ్లీ ఎందుకు సమన్లు పంపిందో తెలియడం లేదని ఆప్ నేతలు వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌కు ఈడీ పంపిన సమన్లు చట్ట విరుద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు పేర్కొన్నారు.