తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో ఓ కానిస్టేబుల్, సీఐపై దాడికి పాల్పడ్డాడు. మర్మాంగాలు కొసేసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ దాడికి అతని భార్య, తోటి కానిస్టేబుళ్లు సైతం సాయం చేయడం గమనార్హం.
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. మలయాళ టీవీ నటి డాక్టర్ ప్రియ 35 ఏళ్ల వయస్సులోనే గుండెపోటుతో మృత్యువాత చెందారు. అయితే ఆమె మరణించిన సమయంలో 8 నెలల గర్భవతిగా ఉండటం పలువురిని కలచివేస్తుంది.
జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న వాహనం ఆకస్మాత్తుగా లోయలో పడిపోయింది. దీంతో ఆ వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు మృత్యువాత చెందగా..మరో 10 మంది గాయపడ్డారు.
చిన్న పిల్లలది తెలిసి తెలియని వయసు. వారు చేసే పనులు అల్లరి అల్లరిగా ఉంటాయి. ప్రతి కిరణా షాపుకు వారు వెళ్తే చాలు. పలు రకాల చిరుతిండి పదార్థాలు తీసుకోవాలని చూస్తారు. అచ్చం అలాంటి సంఘటనే ఇక్కడ జరిగింది. నలుగురు చిన్నారులు(children) ఓ షాపుకు వెళ్లి డబ్బులు ఇవ్వకుండానే కుర్కురే, బిస్కెట్లు తీసుకున్నారు. అది గమనించిన షాపు యజమాని వారిని స్తంభానికి కట్టేసి కొట్టాడు. ఈ ఘటన వీడియో కాస్తా సోషల్ మీడియాలో వ...
పంజాబ్‌లోని పాక్ సరిహద్దులో భద్రతా దళాలకు భారీగా డ్రగ్స్ అండ్ బులెట్స్ దొరికినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బీఎస్ఎఫ్ దళాలు తనిఖీలు చేస్తున్నారు.
చంపాపేట్‌కు చెందిన స్వప్న హత్య కేసులో సంచలన నిజాలు వెలుగు చూశాయి. దర్యాప్తులో కీలక విషయాలను బయటపెట్టారు పోలీసులు. స్వప్న తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధాకంగా ఇది హత్య కేసుగా నమోదు చేశారు.
శ్రీలంక సముద్ర జలాల్లో 37 మంది భారతీయ జాలర్లను సముద్ర సరిహద్దు నిబంధనలు పాటించలేదనే కారణంతో లంక అధికారులు అరెస్టు చేశారు. దీంతోపాటు ఐదు పడవలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వారిలో దాదాపు మొత్తం తమిళనాడు వాసులే ఉన్నారని తెలుస్తోంది.
కేరళ కొచ్చిలోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన పేలుడులో ఒకరు మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎవరైనా కావాలనే చేశారా అనే వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రముఖ కమెడియన్ నటుడు మాథ్యూ పెర్రీ(Matthew Perry) 54 ఏళ్ల వయసులో కన్నుమూశారు. శనివారం లాస్ ఏంజిల్స్‌లోని తన ఇంట్లో నటుడు శవమై కనిపించాడని అక్కడి మీడియా తెలిపింది. అయితే అతను హాట్ టబ్‌లో మరణించడం పట్ల ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఆర్థిక సమస్యలు భరించలేక ఓ కుటుంబంలోని ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దారుణ ఘటన స్థానికలంగా కలకలం రేపింది. చనిపోయిన వారిలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఫ్యామిలీ సూసైడ్‌పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఓ వ్యక్తి ఈజీ మనీ కోసం అమ్మాయిల ఫోటోలతో మార్ఫింగ్ వీడియోలు చేసి అమ్మడం మొదలు పెట్టాడు. ఆ వీడియోలను ట్విట్టర్లో 50 రూపాయలకే అమ్ముతుండటాన్ని సైబర్ పోలీసులు గుర్తించారు. చాకచక్యంగా ఆ వ్యక్తిని సైబర్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
కజకిస్తాన్ గనిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 30 మందికిపైగా మృత్యువాత చెందారు. దీంతో ఈ ఘటనపై అక్కడి దేశాధ్యక్షుడు ఆ గని నిర్వహిస్తున్న సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రోడ్డుకి అడ్డంగా ఉన్న బైక్‌ను తీయమంటూ హారన్ కొట్టినందుకు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను కొందరు దుండగులు తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటన ఏపీ నెల్లూరు జిల్లాలోని కావలిలో జరిగింది. ఈ ఘటన పట్ల పలువురు అనేక విధాలుగా స్పందిస్తున్నారు.
దసరా పండుగ కాదా అని ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి(Software employee) ఫ్యామిలీ వారి సొంతూరికి వెళ్లారు. కానీ తిరిగి వచ్చే క్రమంలో ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. కారు డ్రైవింగ్ చేస్తున్న క్రమంలోనే టైర్ పేలి ఆ ఉద్యోగి అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన హైదరాబాద్ బొంగుళూరు ఓఆర్ఆర్ పరిధిలో జరిగింది.