West Bengal: పశ్చిమ బెంగాల్లోని జల్పాయ్గురిలో ఆకస్మిక తుపాను బీభత్సం సృష్టించింది. ఈ ఆకస్మిక తుపానుకి ఐదుగురు చనిపోగా సుమారు 300కి పైగా గాయపడ్డారు. 800కు పైగా ఇళ్లు ధ్వంసం అయ్యాయి. బలమైన గాలులు వీయడం వల్ల విద్యుత్ స్తంభాలు, ఇళ్లు విరిగిపోగా.. చెట్లు కూలిపోయాయి. రాజర్హత్, బర్నిష్, బకాలీ, జోర్పక్డి, మధబ్దంగా, సప్తిబరి ప్రాంతాల్లో తుపాను ప్రభావం తీవ్రంగా ఉందని అధికారులు తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాలను సీఎం మమతా బెనర్జీ పర్యటించారు.
Jalpaiguri | West Bengal CM Mamata Banerjee met the cyclone-affected people at the Jalpaiguri Super Specialty Hospital.
CM Mamata Banerjee says, "The administration shall stand by the needy people. We are aware of the damage that has happened. The biggest damage that has… pic.twitter.com/hR4fyvB4hR
అలాగే బాధిత కుటుంబాలను పరామర్శించారు. అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తుపాను వల్ల ఎంత ఆస్తి నష్టం జరిగిందో పూర్తిగా తెలియదని తెలిపారు. అన్నింటి కంటే జరిగిన పెద్ద నష్టం ప్రాణ నష్టమని మమతా తెలిపారు. తుపానులో గాయపడ్డ వాళ్లను ఆసుపత్రికి తరలించారు. వాళ్లకు మెరుగైన చికిత్స అందిస్తారని తెలిపారు. ఇప్పటికే సహాయక చర్యలు ముగిశాయని.. వైద్యులు, నర్సులు నిర్విరామంగా పనిచేస్తున్నారని మమతా తెలిపారు.