South Africa: దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 45 మంది మృతి చెందారు. ఈస్టర్ పండుగ కోసం చర్చికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 165 అడుగుల లోతులో బస్సు పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 46 మంది ఈ బస్సులో ప్రయాణించారు. అందరూ చనిపోగా 8 ఏళ్ల బాలిక ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
బోట్స్వానా నుంచి మోరియాకు బయలుదేరిన ఈ బస్సు కొండపై నిర్మించిన వంతెన మలుపు వద్ద అదుపుతప్పి లోయలో పడింది. ఒక్క బాలిక తప్ప డ్రైవర్‌తో సహా అందరూ చనిపోయారు. కొన్ని మృతదేహాలు గుర్తించలేనంతగా మంటల్లో కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈస్టర్ వీకెండ్ సమయంలో ఆ వంతెనపై ట్రాఫిక్ విపరీతంగా ఉందని స్థానికులు తెలిపారు. ఆ ప్రదేశంలో ఉండే జియాన్ చర్చ్‌కి ప్రయాణికులు ఎక్కువగా వెళ్తుంటారు. ఆ దేశంలో ఉన్న పెద్ద చర్చిల్లో ఇది ఒకటి.