»If You Kill My Husband I Will Give You Rs 50 Thousand Up Woman Whatsapp Status
Viral News: తన భర్తను చంపిన వారిక రూ.50 వేలు.. మహిళ వాట్సాప్ స్టేటస్
తన భర్తను చంపాలని, చంపిన వారికి రూ 50 వేలు ఇస్తానని ఓ మహిళ తన వాట్సప్ స్టేటస్‌లో పెట్టుకుంది. అది చూసి భయబ్రాంతులకు గురయైన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
If you kill my husband, I will give you Rs.50 thousand.. UP woman whatsapp status
Viral News: భార్యాభర్తలు అన్న తరువాత గొడవలు సహజం, కొద్ది రోజులు అలగడం, పుట్టింటికి వెళ్లడం, ఆ తరువాత సర్దుకుపోవడం షరా మాములే. కానీ ఓ మహిళ చేసిన పని అందరికి విస్తుగొలిపేలా చేసింది. తన భర్తను చంపిన వారికి నగదు బహుమతి ప్రకటించింది. విషయం తెలుసుకున్న తన భర్త పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసునమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భార్యభర్తల మధ్య మనస్పర్థల కారణంగా ఇద్దరు కోర్టులో విడాకులకు అప్లై చేసినట్లు విచారణలో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లా భింద్ గ్రామానికి చెందిన యువతి, అదే జిల్లా బాహ్ బ్లాక్‌కు చెందిన యువకుడిని 2022 డిసెంబర్లో పెళ్లిచేసుకుంది. కొంతకాలం అన్యోన్యంగా ఉన్న దంపతుల మధ్యలో ఆ తరువాత గొడవలు మొదలయ్యాయి. దీనికి కారణం తన భార్య పక్కింటి వాడితో అక్రమ సంబంధం పెట్టుకుందని, అందుకే ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి అని బాధితుడు వివరించాడు. ఇదే క్రమంలో పుట్టింటికి వెళ్లిన తన భార్యను తీసుకురావడానికి వెళ్తే అత్తమామలు కూడా తనను చంపేస్తానని బెదిరించినట్లు అతను పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో కోర్టులో విడాకుల కోసం అప్లై చేశాడు. ఈ క్రమంలో తన భార్య ప్రియుడు కూడా తనకు ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించాడట. ఈ క్రమంలోనే తన భార్య తనను చంపిని వారికి రూ. 50 వేలు ప్రకటించినట్లు బాధితుడు తెలిపినట్లు పోలీసులు వివరించారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.