రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధి కాటేదాన్‌లోని పహల్ ఫుడ్స్ కంపెనీలో ఈరోజు తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
Pahal Foods: రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధి కాటేదాన్‌లోని పహల్ ఫుడ్స్ కంపెనీలో ఈరోజు తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలోని మూడు అంతస్తులకు మంటలు వ్యాపించాయి. మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది 5 ఫైరింజిన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ మంటలు అదుపులోకి రాలేదు.
ప్రమాదం జరిగినప్పుడు వంద మందికి పైగా సిబ్బంది విధుల్లో ఉన్నారు. అయితే పై అంతస్తులో ప్యాకింగ్ సామగ్రి ఉందని కంపెనీ యాజమాన్యం తెలిపింది. అగ్ని ప్రమాదం దాటికి భవనం పూర్తిగా పగుళ్లు వచ్చి పక్కకు ఒరిగిందని పోలీసులు తెలిపారు. అసలు బిస్కెట్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు ఎలా చెలరేగాయి అనే విషయం ఇంకా తెలియలేదు. అయితే ఈ మంటల్లో భారీగా ఆస్తినష్టం వాటిల్లవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.