సీఎం జగన్ అయిదేళ్ల అరాచక పాలనతో జనం విసిగారని.. తాడేపల్లి ప్యాలెస్‌లో శాశ్వతంగా అతనిని బంధించేందుకు నిర్ణయించుకున్నారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు.
Nara Lokesh: సీఎం జగన్ అయిదేళ్ల అరాచక పాలనతో జనం విసిగారని.. తాడేపల్లి ప్యాలెస్‌లో శాశ్వతంగా అతనిని బంధించేందుకు నిర్ణయించుకున్నారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. జగన్ గెలవడానికి ఎన్నికల్లో ఇంటికి కిలో బంగారం పంచినా ఆయనకు ఓటమి తప్పదని లోకేశ్ అన్నారు. చీప్ట్ర్రిక్స్తో ప్రజాభీష్టాన్ని మార్చలేరన్నారు. రేణిగుంటలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి చెందిన గోదాంలో రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉన్న చేతి గడియారాలు, స్పీకర్లు, విసనకర్రతోపటు మొత్తం 52 రకాల వస్తువుల డంప్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మరి ఇసుక, మద్యం దందాలో దోచిన సొమ్ము డంప్ సంగతేంటని లోకేశ్ అన్నారు. అలాగే రోజూ తన కాన్వాయ్‌ను తనిఖీ చేస్తున్నారు. కనీసం ఒక్క ఎన్నికల నిబంధనల ఉల్లంఘన అయిన కనిపించిందా? అన్నారు. మీ ఎదురుగా సీఎం ఇంట్లోకి వెళ్లిన కంటెయినర్‌ను ఎందుకు తనిఖీ చేయలేదు? అందులో ఏముంది? వీటికి డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి సమాధానం చెప్పాలని లోకేశ్ డిమాండ్ చేశారు.