»Viral Video The Car Stops On The Flyover And Reels What Happened Next
Viral Video: ఫ్లైఓవర్‌పై కారు ఆపి రీల్స్.. తర్వాత ఏమైందంటే?
ఢిల్లీలోని ప్రదీప్ అనే వ్యక్తి కూడా ఇలానే ఓ ఫ్లైఓవర్‌పై కారు ఆపి రీల్స్ చేశాడు. అంతే కాకుండా ట్రాఫిక్‌కి అంతరాయం కలిగిస్తూ.. కారు డోర్ ఓపెన్‌లో ఉంచి కారును నడిపాడు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
Viral Video: ప్రస్తుతం చాలామంది ఫేమస్ కావడానికి ఢిఫరెంట్ రీల్స్ చేస్తున్నారు. చుట్టూ ప్రపంచాన్ని మరిచిపోయి వాళ్లకు ఇబ్బంది పెడుతూ కొందరు రీల్స్ చేస్తుంటారు. అయితే ఢిల్లీలోని ప్రదీప్ అనే వ్యక్తి కూడా ఇలానే ఓ ఫ్లైఓవర్‌పై కారు ఆపి రీల్స్ చేశాడు. అంతే కాకుండా ట్రాఫిక్‌కి అంతరాయం కలిగిస్తూ.. కారు డోర్ ఓపెన్‌లో ఉంచి కారును నడిపాడు. అలాగే పోలీసుల బారికేడ్లకు నిప్పు అంటించి వీడియోలు తీశాడు. వీటిని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అప్లోడ్ చేయగా నెటిజన్లు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన వాళ్లను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
रील बनाने के लिए विभिन्न यातायात प्रावधानों का उल्लंघन करने वाले आरोपी के विरुद्ध #दिल्लीपुलिस ने मोटर वाहन अधिनियम के अंतर्गत सख्त कार्यवाही करते हुए चालान कर वाहन ज़ब्त किया और पुलिसकर्मियों से अभद्रता एवं उनपर हमला करने पर आईपीसी की धाराओं में केस दर्ज कर गिरफ्तार किया। pic.twitter.com/2f5VBJrwtS
పాపులారిటీ కోసం ఇలా చేసేవాళ్లకి జైలుశిక్షతో పాటు వాహనాలను సీజ్ చేయాలని సూచించారు. దీనిపై స్పందించిన ఢిల్లీ పోలీసులు వాళ్లను పట్టుకుని కేసు నమోదు చేసి రూ.36000 జరిమానా విధించారు. అలాగే ఆ కారును సీజ్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసే నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ కారులో ప్లాస్టిక్‌తో తయారు చేసిన కొన్ని నకిలీ ఆయుధాలు పోలీసులకు లభ్యమయ్యాయి. అయితే ప్రదీప్ కారు తన తల్లి పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.