Rameswaram Cafe: బాంబు బ్లాస్ట్ కేసులో ఇద్దరు అరెస్టు
రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో ఇద్దరు ప్రధాన నిందుతులను జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. బాంబర్ ముస్సావిర్ హుస్సెన్ షాజిబ్, సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహాను అరెస్టు చేసింది.
Rameswaram Cafe: రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో ఇద్దరు ప్రధాన నిందుతులను జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. బాంబర్ ముస్సావిర్ హుస్సెన్ షాజిబ్, సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహాను అరెస్టు చేసింది. పేలుడు జరిగినప్పటి నుంచి వీళ్లు అస్సాం, పశ్చిమబెంగాల్లో తలదాచుకున్నట్లు గుర్తించారు. నిందితులిద్దరూ ఓ క్యాప్ కొనడానికి వెళ్లినప్పుడు సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించారు. సిమ్ కార్డులు మార్చుతూ అండర్‌గ్రౌండ్‌కు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ ఎన్ఐఏ రాడార్ నుంచి తప్పించుకోలేకపోయారు.
ఈ పేలుడులో ముఖ్యవ్యక్తి గతంలో శివసముద్రం, గుండ్లుపేట, తమిళనాడులోని కృష్ణగిరి అటవీ విభాగంలో కొందరు యువకులకు ఆయుధాల వినియోగంపై శిక్షణ ఇచ్చాడు. ఈ ఏడాది మార్చిలో బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్‌లో ఉన్న కేఫ్‌లో బాంబు పేలిన ఘటనలో 9 మంది గాయపడ్డారు. కేఫ్‌లో ఇడ్లీ తిని బాంబు బ్లాస్ట్ బ్యాగ్‌ను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. సీసీ టీవీ చిత్రాల ఆధారంగా గుర్తించారు. అతను ధరించిన టోపీ కొనుగోలు చేస్తున్నప్పటి దృశ్యాలతో నిందితులను అరెస్టు చేశారు.