five killed in bapatla ap auto and lorry collision accident
Lorry Overturned Today : రోడ్డు పక్కన నిల్చున్న వారిపై ప్రమాద వశాత్తూ ఓ మట్టి లారీ(LORRY) బోల్తా పడింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం…
కర్ణాటకలోని(KARNATAKA) బాగల్కోట్ జిల్లా, యత్నట్టి క్రాస్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బాధితులంతా పొలంలో పని ముగించుకుని స్వస్థలానికి వెళ్లేందుకు రోడ్డు పక్కన నిలబడి ఉన్నారు. ఆ సమయంలో మట్టితో వస్తున్న లారీ టైరు పేలిపోయింది. దీంతో లారీ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఒకే కుటుంబంలోని వారంతా ఆ మట్టిలో కూరుకుపోయారు. అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృత దేహాలను వెలికి తీసి శవ పరీక్షల నిమిత్తం స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల్ని యంకప్ప శివప్ప తోలమట్టి (72), అతడి భార్య యల్లవ యంకప్ప తోలమట్టి (66), కుమారుడు పుండలీక యంకప్ప తోలమట్టి (40), కుమార్తె నాగవ్వ అశోక బమ్మన్నవర, యంకప్ప అల్లుడు అశోక నింగప్ప బమ్మన్నవర (48)గా పోలీసులు గుర్తించారు.